
అన్నంలో సైనేడ్ కలిపి..ఆరుగురిని చంపేసింది
ప్రి అత్త, మామ, భర్త, మరో ముగ్గురు
మరిది ఫిర్యాదుతో వీడిన మిస్టరీ
తిరువనంతపురం(కేరళ): కేరళలో దారుణం చోటుచేసుకుంది.. క్రైం థ్రిల్లర్‌ను తలపించే రీతిలో ఓ మహిళ హత్యలు చేసింది. తినే అన్నంలో సైనేడ్ కలిపి ఒక్కొక్కరిగా కుటుంబ సభ్యులను తుదముట్టించింది. ఇది ఏ ఒక్క రోజో కాదు.. 2002 నుంచి 2016 మధ్య చేసిన దారుణమిది. కుటుంబ ఆస్తిని దక్కించుకోవడంతో పాటు మరిది(ప్రియుడి)ని పెళ్లాడింది. తొలుత ఇవన్నీ సాధారణ మరణాలే అని నమ్మినా.. తర్వాత అనుమానంతో ఆమె మొదటి భర్త తమ్ముడు క్రైం బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీగలాగితే డొంకంతా కదిలినట్లు పోలీసుల విచారణలో ఆ ఇంటి కోడలు చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. కేరళలోని కూడతాయిలో పొన్నమట్టం కుటుంబానికి చెందిన అన్నమ్మ థామస్, టామ్ థామస్ దంపతులకు రాయ్ థామస్, మోజో అనే కొడుకులు ఉన్నారు.
14 ఏళ్ల క్రితం రాయ్ థామస్‌కు జాలీతో వివాహం జరిగింది. తర్వాత కొత్త కోడలు జాలీకి రాయ్ థామస్ పెద్దనాన్న కొడుకు షాజూతో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ బంధాన్ని కొనసాగించేందుకు జాలీభయంకరమైన ప్లాన్ వేసింది. భర్త కుటుంబానికి చెందిన ఆస్తిని దక్కించుకోవడానికి కుటుంబ సభ్యులతో పాటు షాజు భార్య, కుమార్తెను కూడా హత్య చేసింది. జాలీ, షాజు ఇద్దరూ కలిసే ఈ హత్యలకు పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
2002లో మొదటి హత్య..
2002లో రాయ్ థామస్ తల్లి అన్నమ్మ(57) ఓరోజు ఇంట్లో కుప్పకూలిపోయింది. ఆస్పత్రికి తరలించే లోపే చనిపోయింది. అన్నమ్మది సహజమరణమేనని కుటుంబ సభ్యులు భావించారు. తర్వాత ఆరేళ్లకు.. 2008లో అన్నమ్మ భర్త టామ్ థామస్(66) హార్ట్ ఫెయిల్యూర్ కారణంగా చనిపోయారు. ఆపై మూడేళ్లకు(2011లో) జోలీ భర్త రాయ్‌థామస్(40) కూడా ఇదేవిధంగా చనిపోయారు. పోస్ట్‌మార్టంలో రాయ్‌పై విషప్రయోగం జరిగిందని తేలింది. మరో మూడేళ్లు గడిచాక 2014లో అన్మమ్మ సోదరుడు మ్యాథ్యూ మంజాదియల్(67) అనుమానాస్పదంగా చనిపోయాడు. వరుసగా జరుగుతున్న మరణాలపై కుటుంబసభ్యులు, బంధువుల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఎలాంటి ఆధారాలు దొరకలేదు. రెండేళ్లు గడిచాక ఆ కుటుంబంతో దగ్గరి బంధుత్వం ఉన్న షాజు, సిలీ దంపతుల కుమార్తె అల్ఫోన్సా(2) చనిపోయింది. తర్వాత 2 నెలలకే సిలీ(27) కూడా చనిపోయింది.
ఆస్తి కోసమే హత్యలు..
ఏకంగా ఆరుగురు దుర్మరణం చెందడంపై టామ్ థామస్, అన్నమ్మల చిన్న కొడుకు మోజోకు అనుమానం వచ్చింది. పోలీసులకు కంప్లైంట్ చేశా డు. కుటుంబ సభ్యులు చనిపోవ డంతో ఆస్తి సగం ఆ ఇంటి కోడలు, రాయ్ థామస్ భార్య అయిన జాలీకి దక్కింది. ఆస్తి తన చేతుల్లోకి వచ్చాక జాలీ తన ప్రియుడు షాజును పెళ్లి చేసుకుంది. ఈ వ్యవహారం కూడా అనుమానాలకు తావి చ్చింది. దీంతో ఈ మరణాల వెనక మిస్ట రీ తేల్చాలంటూ బంధువులు క్రైం బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు లో భాగంగా సమాధులను తవ్వి తీసి మరోసారి శవ పంచనామా జరిపించా రు. రిపోర్టుల్లో సైనేడ్ వల్లే వారంతా చని పోయినట్టు తేలింది. ఆస్తి కోసం మామ టామ్ థామస్‌పై ఒత్తిడి తెచ్చిన జాలీ.. భర్తతో పాటు ఐదుగురు కుటుం బ సభ్యులకు కొంచెం కొంచెంగా సైనేడ్ ఇచ్చి చంపేసినట్టు పోలీసులు చెప్పారు.