మర్డర్‌‌ కేసులో నిందితుడిని పట్టించిన చెప్పు

మర్డర్‌‌ కేసులో నిందితుడిని పట్టించిన చెప్పు

అదో యువకుడి మిస్సింగ్ కేసు.. కిడ్నాప్ ఏమో అని దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులకు ఆ తర్వాత షాకింగ్ నిజాలు తెలిశాయి. అతడు వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ భర్తనే ఆ యువకుడిని హత్య చేశాడని ఇన్వెస్టిగేషన్‌ తేలింది. అయితే ఈ కేసులో హంతకుడిని పట్టించింది మాత్రం ఆ యువకుడి చెప్పు.. ఇన్వెస్టిగేషన్‌లో పోలీసులకు అదే పెద్ద లీడ్‌గా ఉపయోగపడింది. 

మహారాష్ట్రలోని పుణేలో బవధాన్ ప్రాంతంలో నివసించే 27 ఏళ్ల యువకుడు కనిపించకుండా పోవడంతో అతడి తల్లి అక్టోబర్ 22న పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తుండగా ఒక లింక్ తగిలింది. అతడి కాల్‌ హిస్టరీ పరిశీలించగా.. కనిపించకుండా పోయిన రోజు చివరిగా ఓ మహిళ నంబర్‌‌కు ఫోన్‌ చేసి ఉన్నట్లు గుర్తించారు. విచారణలో భాగంగా ఆమెతో ఆ యువకుడికి వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది. దీంతో ఈ వ్యవహారానికి, అతడు కనిపించకుండా పోవడానికి ఏదైనా లింక్ ఉందేమోనన్న దిశగా పోలీసులు ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఏదైనా ఆధారం దొరుకుతుందని.. ఆమె ఇల్లంతా పూర్తిగా సోదాలు చేశారు. అయితే ఇంటి బయట గార్డెన్‌లో ఆ యువకుడి చెప్పు పోలీసులకు దొరికింది. దీంతో అతడు కనిపించకుండా పోవడానికి ముందు కచ్చితంగా అక్కడికి వచ్చి ఉంటాడని నిర్ధారించుకున్న పోలీసులు.. మరింత లోతుగా దర్యాప్తు మొదలుపెట్టారు. ఎట్టకేలకు ఆ మహిళ భర్త, మరో ఇద్దరితో కలిసి ఆ యువకుడిని హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. తొలుత పుణేలోనే ఒక నిందితుడిని అరెస్ట్ చేయగా.. ఆ తర్వాత మరో ఇద్దరిని మధ్యప్రదేశ్‌లో అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. వారిని అరెస్టు చేశాక విచారించగా.. ఆ మహిళ భర్త తన భార్య ఫోన్‌కు యువకుడి నుంచి మిస్డ్‌కాల్స్ రావడం గమనించి, వారి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్టు అనుమానించి అక్టోబర్ 21న తన ఇంటికి వచ్చినప్పుడు మాటు వేసి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడు, ఇద్దరు స్నేహితులతో కలిసి ఆ యువకుడిని కత్తితో పొడిచి.. ఆ తర్వాత డెడ్‌బాడీని దహనం చేసి ఆ బూడిదను సిటిటీలో వేర్వేరు చోట్ల చల్లినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తల కోసం..

అమెజాన్‌లో పర్స్ ఆర్డర్ చేస్తే.. పాస్ పోర్టు కూడా వచ్చేసింది

లో బీపీ ఉందా ? అయితే మీ గుండె కాస్త జాగ్రత్త

వీడియో వైరల్‌: ఛేజ్‌ చేసి పోలీస్‌ను పట్టుకున్న ఏసీబీ అధికారులు