పాక్ మిసైళ్లను పేల్చేసిన సుదర్శన చక్ర.!

పాక్ మిసైళ్లను పేల్చేసిన సుదర్శన చక్ర.!
  • పాక్​ దాడులను అడ్డుకున్న ఎస్–400 డిఫెన్స్ సిస్టమ్
  • దీనిని రష్యా నుంచి కొనుగోలు చేసిన ఇండియా
  • పాక్ క్షిపణులను వెంటాడి న్యూట్రలైజ్ చేసిన హార్పీ డ్రోన్లు
  • స్కై స్ట్రైకర్ సూసైడ్ డ్రోన్లదీ కీ రోల్

​పాకిస్తాన్ దాడులను ఇండియా దీటుగా తిప్పికొట్టింది. బుధవారం అర్ధరాత్రి దాటాక.. గురువారం తెల్లవారుజామున పాకిస్తాన్ ప్రయోగించిన 15 మిసైళ్లను మన భద్రతా బలగాలు న్యూట్రలైజ్ చేశాయి. రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్–400 సుదర్శన చక్ర డిఫెన్స్ సిస్టమ్, ఇజ్రాయెల్​కు చెందిన హార్పీ డ్రోన్లు ఇందులో కీలక పాత్ర పోషించాయి. పాకిస్తాన్​తో పాటు లాహోర్​లోని ఎయిర్ డిఫెన్స్ రాడార్స్​ను డిసేబుల్ చేసేందుకు బార్డర్ వెంట హార్పీ డ్రోన్లను ఇండియా మోహరించింది. శత్రువుల జామింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విధానాలను ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ – 400 తట్టుకోగలదు. ఇది యుద్ధవిమానాలు, డ్రోన్లు, క్రూజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్షిపణులు, బాలిస్టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిసైళ్లను అత్యంత కచ్చితత్వంతో నేలకూల్చగలదు. రూ.35వేల కోట్లు పెట్టి ఐదు ఎస్–400 డిఫెన్స్ సిస్టమ్​లను కొనుగోలు చేసేందుకు రష్యాతో ఇండియా డీల్ కుదుర్చుకున్నది. ఇప్పటికే 3 డిఫెన్స్ సిస్టమ్​లు వచ్చేశాయి. ఇంకో 2 వచ్చే ఏడాది ఆగస్టులో డెలివరీ అవుతాయి. 

సూసైడ్ డ్రోన్లదీ కీలక పాత్ర..  

ఆపరేషన్ సిందూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉపయోగించిన సూసైడ్ డ్రోన్లు (లోయిటరింగ్ మ్యూనిషన్స్) బెంగళూరులో తయారు చేశారు. ఈ డ్రోన్లలో స్కై స్ట్రైకర్ డ్రోన్లు ఎంతో ముఖ్యమైనవి. ఇవి బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్, ఇజ్రాయెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఎల్బిట్ సెక్యూరిటీ సిస్టమ్స్ కలిసి తయారు చేశాయి. ఈ సూసైడ్ డ్రోన్లు 100 కిలో మీటర్ల వరకు ప్రయాణించగలవు. 5 కిలోలు లేదంటే 10 కిలోల బరువున్న పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలవు. ఇందులో ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్ ఉంది. దీనివల్ల డ్రోన్ గాల్లో ఉన్నప్పుడు సౌండ్ రాదు. తక్కువ ఎత్తులో ప్రయాణిస్తున్నా.. శత్రువులు గుర్తించలేరు. దీన్ని రహస్య దాడులకు ఉపయోగిస్తుంటారు. ఈ డ్రోన్లు.. ఆపరేటర్ ఎంచుకున్న లక్ష్యాలను ఆటోమేటిక్​గా గుర్తిస్తాయి. కచ్చితమైన లక్ష్యాన్ని ఎంచుకుని దాడులు చేస్తాయి. ఆపరేషన్ సిందూర్​లో ఈ స్కై స్ట్రైకర్ డ్రోన్లు.. పాకిస్తాన్, పీవోకేలోని 9 టెర్రరిస్టు క్యాంపులను ధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషించాయి.

ఎస్​400 డిఫెన్స్ సిస్టమ్ ప్రత్యేకతలు ఇవే.. 

  • ఎస్–400 అనేది అత్యంత అధునాతనమైన లాంగ్- రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ (ఎస్​ఏఎం) డిఫెన్స్ సిస్టమ్. గరిష్టంగా 400 కి.మీ పరిధి వరకు ఇవి పని చేస్తాయి. 30 కిలో మీటర్ల ఎత్తులో ఉన్న లక్ష్యాలను సైతం న్యూట్రలైజ్ చేయగల సామర్థ్యం ఎస్–400 సొంతం. 
  • బాలిస్టిక్ మిసైళ్లను 60 కిలో మీటర్ల రేంజ్​లోనే నిరోధించగలదు. 250 కిలో మీటర్ల గగనతల లక్ష్యాలను ఎస్–400 డిఫెన్స్ సిస్టమ్ నాశనం చేయగలదు. 400 కిలో మీటర్ల రేంజ్, యాక్టివ్ రాడార్ హోమింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సుదూర లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం దీని సొంతం. 
  • 40 నుంచి 120 కిలో మీటర్ల రేంజ్, ఫైటర్ జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల వంటి కదిలే లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో నాశనం చేయగలదు. అదేవిధంగా, 600 కిలో మీటర్ల దూరంలో ఉన్న 300 టార్గెట్లను ట్రాక్ చేయగల థ్రీ-డైమెన్షనల్ ఫేజ్డ్-అరే రాడార్ ఎస్–400లో ఉంటుంది. స్టెల్త్ విమానాలు, తక్కువ ఎత్తులో ఎగిరే లక్ష్యాలను కూడా ఇది గుర్తిస్తుంది. 
  • ఒకేసారి 36 లక్ష్యాలను ఎస్ 400 డిఫెన్స్ సిస్టమ్ ఎంగేజ్ చేస్తుంది. 80 లక్ష్యాలను ట్రాక్ చేస్తుంది. 9 నుంచి 10 సెకన్లలోనే పని ముగించేస్తుంది. 
  • ట్రక్​లపైనే ఎస్ 400 డిఫెన్స్ సిస్టమ్ సెట్ చేసి ఉంటుంది. 5 నిమిషాల్లో సిస్టమ్ మొత్తం యాక్టివ్ అవుతుంది. రోడ్డుపై గంటకు 60 కిలో మీటర్లు, ఆఫ్ రోడ్డుపై గంటకు 25 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. 2014లో చైనా ఫస్ట్ టైమ్ ఎస్ 400 డిఫెన్స్ సిస్టమ్​ను కొనుగోలు చేసింది. ఇందులో మిసైల్ లాంచర్లు, పవర్ ఫుల్ రాడార్, కమాండ్ సెంటర్ అనే 3 కీలక కాంపోనెంట్లు ఉంటాయి. ఎంతటి మోడ్రన్ జెట్లు అయినా దీని రాడార్​లో కనిపిస్తుంటాయి. చైనా, పాకిస్తాన్ బార్డర్​వెంట నార్త్, ఈస్ట్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో ఎస్ 400 డిఫెన్స్ సిస్టమ్స్​ను మోహరించారు. అమెరికా, చైనా, ఇజ్రాయెల్ వద్ద ఉన్న డిఫెన్స్ సిస్టమ్స్ కంటే ఎంతో అత్యాధునికమైనవి.

హార్పి డ్రోన్ల ప్రత్యేకతలు ఇవే.. 

  • హార్పీ డ్రోన్ అనేది ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (ఐఏఐ) తయారు చేసిన ఒక లాయిటరింగ్ మ్యూనిషన్ (సూసైడ్ డ్రోన్). ఇది ప్రధానంగా శత్రువుల రాడార్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను నాశనం చేయడానికి, సప్రెషన్ ఆఫ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్సెస్ (సీడ్) మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల కోసం తయారు చేశారు.
  • హార్పి డ్రోన్ పొడవు 2.7 మీటర్లు, రెక్కల విస్తీర్ణం 2.1 మీటర్లు ఉంటుంది. ఫుల్ లోడ్ అయి ఉన్నప్పుడు దీని బరువు 135 కిలో గ్రాములు ఉంటుంది. డెల్టా-వింగ్ డిజైన్, యూఈఎల్ ఏఆర్ 731 38 హార్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పవర్ ప్రొపెల్లర్ ఇంజిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇందులో బిగించారు. 
  • ట్రక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై లేదా షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై ఉన్న కంటైనర్ లాంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల నుంచి రాకెట్ అసిస్టెడ్ లాంచ్. ఒక్కో ట్రక్ 18 డ్రోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను మోసుకెళ్లగలదు. ఒక బ్యాటరీలో 54 డ్రోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఉంటాయి. 500 కిలో మీటర్ల రేంజ్ వరకు పని చేస్తాయి.
  • గరిష్ఠంగా గంటకు 185 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్తాయి. శత్రువుల రాడార్లు గుర్తించనంత వరకు కొన్ని గంటల పాటు ఆకాశంలోనే తిరుగుతూ ఉండగలవు. 32 కిలోల హై ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లోసివ్ వార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెడ్, రాడార్ యాంటెన్నా ఉంటాయి. 
  • తాజాగా పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఎయిర్ డిఫెన్స్ రాడార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను లక్ష్యంగా చేసుకుని ఇండియన్ ఆర్మీ హార్పీ డ్రోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ప్రయోగించింది. ఈ డ్రోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు పాకిస్తాన్ రాడార్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను నిర్వీర్యం చేయడంలో కీలక పాత్ర పోషించాయి.
  • హార్పీ డ్రోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఇండియా, చైనా, దక్షిణ కొరియా, టర్కీ, ఇజ్రాయెల్ ఆర్మీ వద్దే ఉన్నాయి.