సొంతగడ్డపై వరుసగా న్యూజిలాండ్ పదో వన్డే సిరీస్ సొంతం

 సొంతగడ్డపై వరుసగా న్యూజిలాండ్ పదో వన్డే సిరీస్ సొంతం

హామిల్టన్: స్వదేశంలో తమకు తిరుగులేదని న్యూజిలాండ్ మరోసారి నిరూపించింది. సొంతగడ్డపై వరుసగా పదో వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. ఇంగ్లండ్ టాపార్డర్ మరోసారి ఫెయిలవడంతో  బుధవారం జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌‌‌‌ను మరో మ్యాచ్‌‌‌‌ మిగిలుండగానే 2-–0తో సొంతం చేసుకుంది. కివీస్ చివరగా 2019 జనవరిలో స్వదేశంలో  ఓ వన్డే సిరీస్ కోల్పోయింది.  ఏకపక్ష మ్యాచ్‌‌‌‌లో తొలుత బ్యాటింగ్‌‌‌‌కు వచ్చిన ఇంగ్లిష్ టీమ్ 36 ఓవర్లలో 175 రన్స్‌‌‌‌కే కుప్పకూలింది.

  జెమీ ఓవర్టన్ (42), కెప్టెన్ హ్యారీ బ్రూక్ (34) తప్ప మిగతా బ్యాటర్లు ఫెయిలయ్యారు. బ్లెయిర్ టిక్నర్ (4/-34), నేథన్ స్మిత్ (2/27) దెబ్బకు వరుస క్రమంలో వికెట్లు కోల్పోయిన ఇంగ్లిష్ టీమ్ ఏ దశలోనూ కివీస్‌‌‌‌కు పోటీ ఇవ్వలేకపోయింది. అనంతరం చిన్న టార్గెట్ ఛేజింగ్‌‌‌‌లో  డారిల్ మిచెల్ (56 నాటౌట్), రచిన్ రవీంద్ర (54) ఫిఫ్టీలతో సత్తా చాటడంతో  కివీస్ 33.1 ఓవర్లలోనే 177/5 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. నిలకడగా 140 ప్లస్ స్పీడ్ బౌలింగ్‌‌‌‌తో జోఫ్రా ఆర్చర్ (3/23) ఇబ్బంది పెట్టినా..  మిచెల్‌‌‌‌, రవీంద్రతో పాటు  కెప్టెన్ మిచెల్ శాంట్నర్ (34 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు.  టిక్నర్‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.  ఈ సిరీస్‌‌‌‌లో చివరి, మూడో వన్డే శనివారం వెల్లింగ్టన్‌‌‌‌లో జరగనుంది.