జీ మెయిల్ అకౌంట్ ఎలా డిలీట్ చేయాలంటే.?

జీ మెయిల్ అకౌంట్ ఎలా డిలీట్ చేయాలంటే.?

చాలామందికి రెండు మూడు జీ–మెయిల్​ అకౌంట్లు ఉంటాయి. అయితే, వాటిలో ఒకటో రెండో మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తారు. దాంతో వాడని అకౌంట్​ని డిలిట్​ చేస్తే బాగుంటుంది  అనుకుంటారు. కానీ, అలాచేస్తే గూగుల్​ అకౌంట్​ సెట్టింగ్స్​, ఇతర ఇ–మెయిల్స్ పూర్తిగా పోతాయేమోననే భయం వేస్తుంది. అయితే, జీ–మెయిల్ అకౌంట్​ని మాత్రమే డిలిట్​ చేయాలంటే....ముందుగా జీ–మెయిల్​ అకౌంట్​లోకి సైన్​ఇన్​ కావాలి. కుడివైపు పైన కనిపించే సెట్టింగ్స్​ ఆప్షన్​లో అకౌంట్​ని సెలక్ట్​ చేసుకోవాలి. తర్వాత డేటా, ప్రైవసీ మెనూలోకి వెళ్లి, ‘డేటా ఫ్రమ్​ యాప్స్​, సర్వీసెస్​ యు యూజ్​’ ట్యాబ్​ని ఎంచుకోవాలి. ఇప్పుడు ‘డౌన్​లోడ్​ ఆర్​ డిలిట్​’ ఆప్షన్​లో  జీ–మెయిల్​ని సెలక్ట్​ చేసి, డిలిట్​బటన్​ నొక్కాలి. తర్వాత ఆల్టర్నేట్​ జీ–మెయిల్​ ఎంటర్​ చేసి, ‘సెండ్​ వెరిఫికేషన్​ ఇమెయిల్​’ ఆప్షన్​ ఎంచుకోవాలి. ఆల్టర్నేట్​ ఇ–మెయిల్​ ఓపెన్​ చేసి, డిలిట్​ లింక్​పై క్లిక్​ చేయాలి. ఇప్పుడు  డిలిట్​ చేయాలనుకున్న జీ–మెయిల్​కి లాగిన్​ అయ్యి, ‘ఎస్​, ఐ వాంట్​ టు డిలిట్​ దిస్​ ఇ–మెయిల్’ అప్షన్​పై క్లిక్​ చేసి, కన్ఫామ్​ బటన్​ నొక్కితే ఇ–మెయిల్​ అకౌంట్​ డిలిట్​ అవుతుంది.