ఐ ఫోన్​లో  వీడియో రికార్డింగ్​ చేయాలంటే.?

ఐ ఫోన్​లో  వీడియో రికార్డింగ్​  చేయాలంటే.?

ఐ ఫోన్​లో బ్యాక్​గ్రౌండ్​లో పాటలు వింటూ వీడియో రికార్డింగ్​ చేయడం కుదరదు. ఎందుకంటే... వీడియో మోడ్​ ఆన్​ చేయగానే ఆటోమెటిక్​గా మ్యూజిక్​ ఆగిపోతుంది. వీడియో ఆన్​ ఉన్నంత వరకు బ్యాక్​గ్రౌండ్​లో మ్యూజిక్​ ప్లే కాదు. దాంతో వీడియోలకి బ్యాక్​గ్రౌండ్ మ్యూజిక్​ సెట్ చేయడం కష్టమవుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే...

ఐ ఫోన్​లో మ్యూజిక్​ ప్లే చేసి, కెమెరా యాప్​ ఓపెన్​ చేయాలి. నేరుగా వీడియో మోడ్​లోకి వెళ్లకుండా  ఫొటో సెక్షన్​లోనే కెమెరా మోడ్​లో ఉంచాలి. బ్యాక్​గ్రౌండ్​లో మ్యూజిక్​ ప్లే అవుతుందా? లేదా? చూసుకోవాలి. ఇప్పుడు వైట్ షట్టర్​ ఐకాన్​ని ప్రెస్​ చేసి ఫొటోలు తీయాలి. షట్టర్​ ఐకాన్​ని అలాగే నొక్కి పట్టుకొని, దాన్ని స్క్రీన్​కి కుడివైపు తీసుకొస్తే లాక్​ అవుతుంది. అప్పుడు బ్యాక్​గ్రౌండ్​లో మ్యూజిక్​ ప్లే అవుతుంటే వీడియో రికార్డింగ్​ చేయొచ్చు. రికార్డింగ్​ అయిపోగానే స్క్రీన్​ మధ్యలో ఉన్న రెడ్ బటన్​ నొక్కితే వీడియో సేవ్​ అవుతుంది. 

ఫేస్​ ఐడీ విత్​ మాస్క్​

ఐ ఫోన్​ వాడేవాళ్లలో కొందరు ఫేస్​ ఐడీ అన్​లాకింగ్​ పెట్టుకుంటారు. అయితే, ఈ కరోనా టైమ్​లో మాస్క్​ తప్పనిసరి కావడంతో  వీళ్లకు ఫోన్​​ అన్​లాక్​ చేయడం పెద్ద సమస్య అయింది.  మాస్క్​ పెట్టుకున్నప్పుడు బయోమెట్రిక్​ రికగ్నిషన్​ కొంచెం కష్టమే.  అలాంటివాళ్లకు గుడ్​న్యూస్​.... మాస్క్​ పెట్టుకున్నా కూడా ఫోన్​ని అన్​లాక్​ చేసే ఫీచర్​ తీసుకొచ్చే పనిలో ఉంది యాపిల్​. కొత్తగా రానున్న ఐఓఎస్​ 15 అప్​డేట్​లో ఈ ఫీచర్​ అందుబాటులోకి తేనుంది. ‘అందుకోసం  కొత్తగా ఒక ఆల్​గారిథమ్​ని డెవలప్​ చేసింది. దాని సాయంతో కళ్ల మీదనే ఫోకస్​ చేసి, ఫోన్​ని అన్​లాక్​ చేసే ఫీచర్​ తీసుకురానుంది. ఇప్పటికైతే ఫేస్​ ఐడీ విత్​ మాస్క్​ ఫీచర్​  టెస్టింగ్​ స్టేజ్​లో ఉంది.