Good Health: డయాబెటిస్ పేషెంట్ల కోసం హెల్దీ బ్రేక్ ఫాస్ట్..

Good Health: డయాబెటిస్ పేషెంట్ల కోసం హెల్దీ బ్రేక్ ఫాస్ట్..

చిన్నా పెద్దా... ఆడ, మగ అన్న తేడా లేకుండా చాలామంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. షుగర్ పేషంట్ల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. మందులు వేసుకోవడం, రోజూ ఎక్సర్సైజ్ చేయడం మామూలే. దాంతో పాటు పౌష్టికాహారం తీసుకోవడం తప్పనిసరి. అయితే డయాబెటిస్ పేషెంట్లు.. ఏం తింటే ఏమవుతుందో అని భయపడుతుంటారు. అలాంటి వాళ్ల కోసమే స్పెషల్స్....

టొమాటో ఓట్స్ ఆమ్లెట్

కావల్సినవి:

  • గుడ్లు-2, 
  • ఓట్స్ - పావు కప్పు, 
  • పాలు- 2 లేదా 3 టేబుల్ స్పూన్లు, 
  • ఉప్పు - సరిపడినంత, 
  • పసుపు - చిటికెడు, 
  • మిరియాల పొడి-1 టేబుల్ స్పూన్, 
  • ఉల్లిపాయలు - 2 టేబుల్ స్పూన్లు, 
  • క్యారెట్ -2 టేబుల్ స్పూన్లు, 
  • క్యాప్సికమ్ - 2 టేబుల్ స్పూన్లు,
  • టొమాటో ముక్కలు -2 టేబుల్ స్పూన్లు, 
  • పచ్చిమిర్చి- రెండు 

తయారీ:
ఒక గిన్నెలో ఓట్స్, పసుపు, ఉప్పు, మిరియాల పొడి వేసుకుని పాలతో గ్రేవీలా చేయాలి. ఆ గ్రేవీ లోనే గుడ్లు వేసి బాగా కలపాలి. తర్వాత పాస్పై కొంచెం నూనె వేసి వేడి చేసుకుని, ముందుగా కలుపుకున్న ఓట్స్ మిశ్రమాన్ని ఆమ్లెట్లా వేసుకోవాలి. దాని తర్వాత కూరగాయల ముక్కలన్నీ ఆమ్లెట్ పై ఒక పొరలా వేయాలి. తర్వాత రెండు వైపులా కాల్చుకోవాలి.

బేసిన్ చిలా

కావాల్సినవి..

  • శెనగపిండి (బేసిస్)- 1 కప్పు, 
  • వాము - అర టీస్పూన్, 
  • పసుపు - చిటికెడు, 
  • ఉల్లిపాయలు- 3 టేబుల్ స్పూన్లు, 
  • టొమాటో ముక్కలు -3 టేబుల్ టీస్పూన్లు, 
  • పచ్చిమిర్చి- ఒకటి, అల్లం - చిన్న ముక్క, 
  • కొత్తిమీర - కొంచెం, 
  • నూనె - సరిపడినంత

తయారీ:
ఒక గిన్నెలో శెనగపిండి, వాము, పసుపు, ఉప్పు వేసి కొద్దిగా నీరు పోసి ఉండలు లేకుండా కలపాలి. తర్వాత ఈ మిశ్రమంలో అల్లం, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి కలపాలి. పాస్పై కొంచెం నూనె వేసి తయారు. చేసిన మిశ్రమాన్ని దోశలా వేయాలి. పైన కొంచెం అయిల్ వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. ఈ డిష్ టీతో స్నాక్ లేదా చట్నీతో తినొచ్చు.