పెరుగు స్మూతీ తాగేద్దాం

పెరుగు స్మూతీ తాగేద్దాం

వేసవి వేడిని తరిమి కొట్టాలంటే ఒంటిని చల్లబర్చే ఫుడ్​ తినాలి. వాటిల్లో పెరుగుది ఫస్ట్​ ప్లేస్​. అందులోనూ పెరుగు, అరటిపండు  కలిపి స్మూతీ చేసుకుంటే..సూపర్​ కాంబినేషన్​ అవుతుంది.

మరింకెందుకు ఆలస్యం. 
పెరుగు – బనానా  స్మూతీ   

కావాల్సినవి
పెరుగు – ఒక కప్పు, అరటి పండు – ఒకటి
చక్కెర – మూడు టీ స్పూన్లు
కుంకుమ పువ్వు – చిటికెడు, 
యాలకుల పొడి – చిటికెడు , జీడిపప్పు పలుకులు – కొన్ని

ఇలా చేయాలి
అరటిపండుని చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో గ్రైండ్ చేయాలి.  అందులో చక్కెర, పెరుగు  కూడా వేసి మరోసారి  గ్రైండ్​ చేయాలి. ఆ మిశ్రమాన్ని  గ్లాసులో పోసి   కొద్దిసేపు  ఫ్రిజ్‌‌లో ఉంచాలి. తర్వాత కుంకుమ పువ్వు, జీడిపప్పు పలుకులు కూడా వేస్తే  కూల్​కూల్​ పెరుగు స్మూతీ రెడీ.