కోవిడ్ తర్వాత లీడర్లు‌‌ ఎట్లుండాలె?: రతన్ టాటా

కోవిడ్ తర్వాత లీడర్లు‌‌ ఎట్లుండాలె?: రతన్ టాటా

ఫ్యూచర్‌ లో బిజినెస్‌ మన్‌ కావాలనుకునే వాళ్లలో చాలామందికి రతన్ టాటా ఒక ఇన్సిపి రేషన్‌ . కేవలం వీళ్లకే కాదు… యూత్‌ లో చాలామందికి ఆయన అంటే ఇష్టం , ఇన్సిపిరేషన్‌ ! ఎందుకంటే, నేర్చుకోవడంలో, ఒక మెట్టు నుంచి మరో మెట్టు కు ఎదగడంలో ఇప్పటివరకూ ఆయన ఎక్కడా ఫెయిల్‌ కాలేదు. ప్యాండెమిక్‌ టైమ్‌ లో పెద్దపెద్ద కంపెనీలు కూడా కుప్పకూలాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో నూ రతన్ టాటా, ఆయన కంపెనీలు మాత్రం కస్టమర్లు, స్టేక్ హోల్డర్స్‌‌ నమ్మకాన్ని నిలబెట్టు కున్నాయి. రతన్ టాటా ఐడియాలజీస్‌ ని ఫాలో అయితే మనం  ఇలాగే సక్సెస్ అవుతాం. కోవిడ్‌ తర్వాత వర్క్‌‌ప్లేస్‌ లో టాటా చెప్పే ‘గోల్డెన్ రూల్స్ ఆఫ్‌ లీడర్‌ షిప్‌ ’ ఇంప్లిమెంట్ చేయగలిగితే, సక్సెస్‌ ఫుల్‌ లీడర్స్‌‌గా ఎదగొచ్చు.

యంగ్‌ స్టర్స్‌‌తో కలిసి మెలసి వయసుతో అనుభవం వస్తుంది. అయితే, యంగ్‌ స్టర్స్‌ తో కనెక్ట్‌‌ కావడం వల్ల ఆ అనుభవానికి పదును పెరుగుతుంది. వాళ్లతో గడిపితే యంగ్‌ స్టర్స్‌ లో ఉండే ఎనర్జీ ఇన్‌ ఫెక్షన్‌ లా మనలోకి వచ్చేస్తుంది. అప్పుడు ఓల్డ్‌ అవడానికి బదులు.. ఇంకా యంగ్‌ గా తయారవుతాం. ‘ మన దేశ యూత్‌ తో కంపెనీ.. నాలో ఉత్సాహాన్ని పెంచుతుంది. వాళ్లలో అనంతమైన శక్తి ఉంటుంది. వాళ్లతో మాట్లాడినప్పుడు నాకు వయసు అయిపోలేదనే ఫీలింగ్‌ తీసుకొస్తారు”అంటారు టాటా. కాబట్టి, వర్క్‌ ప్లేస్‌ లో యంగ్‌ స్టర్స్‌ తో ఎక్కువగా టచ్‌ లో ఉండాలి. ఇప్పటి యూత్‌ పల్స్‌ పట్టుకోగలిగితే… ఫ్యూచర్‌‌‌‌ బిజినెస్‌ రూపురేఖల్ని అంచనా వేసి సక్సెస్‌ సాధించొచ్చు.

యూనిటీతో ఉండాలి

ఐకమత్యమే మహాబలం! ఈ సూత్రం అన్ని ప్రొఫెషన్స్‌ కి, అన్ని బిజినెస్‌ లకు వర్తిస్తుంది. కంపెనీ టఫ్‌ టైమ్‌ ఫేస్‌ చేస్తున్నప్పుడు మన ఎంప్లాయిస్‌ మనతోనే ఉండాలని కోరుకుంటాం . కఠిన పరిస్థితులు ఎదుర్కొంటు న్నప్పుడు ఒక లీడర్‌‌‌‌గా వాళ్లకు ఇచ్చే మోటివేషన్ చాలా ఇంపార్టెంట్‌.ఎంప్లాయిస్‌ అంతా యూనిటీగా పని చేసినప్పుడు మాత్రమే టఫ్‌ టైమ్స్‌ లో ‘ఇది మన కంపెనీ.. ఈ సమస్య నుం చి బయటపడేయడం మనందరి బాధ్యత’ అనే యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. అంటే ప్రతి సందర్భంలో మనం కచ్చితంగా యూనిటీగా పని చేయాలి. “మనం యూనిటీతోగా ఉండి సమస్యల్ ని సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. యూనిటీగా ఉంటేనే ఈ క్రైసిస్‌ ని దాటగలం” అని తన కంపెనీ మీటింగ్స్‌ లో ఈ ఫిలాసఫీని చెప్తుంటారు టాటా.

ఎంప్లాయిస్ కి అందుబాటులో

మన దేశంలో ఎంప్లాయ్‌ ఫ్రెండ్లీ కంపెనీల్లో టాటా ఒకటి. ఎందుకంటే కేవలం తన కస్టమర్లకే కాదు, ఎంప్లాయిస్‌ కి కూడా లీడరే ఆన్సరబుల్ అనే ప్రిన్సిపుల్‌‌ని టాటా గట్టిగా నమ్ముతారు. “ఒక బిజినెస్ లీడర్‌‌‌‌గా షేర్‌ ‌‌‌హోల్డర్స్‌ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలాగే, ఇక్కడ ఇంకొంత మంది ఉంటారు. వాళ్లు మనకోసం పని చేస్తుంటారు. వాళ్లకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్లే ఎంప్లాయిస్‌ . వాళ్లకోసం మనమెప్పుడూ నిలబడాలి’ అంటారు టాటా. ఎంప్లాయిస్‌ అంతా యూనిటీగా పని చేసినప్పుడు మాత్రమే టఫ్‌ టైమ్స్‌ లో ‘ఇది మన కంపెనీ.. ఈ సమస్య నుంచి బయటపడేయడం మనందరి బాధ్యత’ అనే యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. అంటే ప్రతి సందర్భంలో మనం కచ్చితంగా యూనిటీగా పని చేయాలి. “మనం యూనిటీతోగా ఉండి సమస్యల్ ని సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. యూనిటీగా ఉంటేనే ఈ క్రైసిస్‌ ని దాటగలం” అని తన కంపెనీ మీటింగ్స్‌ లో ఈ ఫిలాసఫీని చెప్తుంటారు టాటా.

సానుభూతి క్రియేట్ చేయాలి

ఒకవేళ ఎంప్లాయిస్‌ వర్క్‌ ప్లేస్‌ ని తమ ఇంటిలాగా ఫీల్‌‌అయితే, అది సానుభూతితో కూడిన రిలేషన్‌ షిప్‌‌ని డెవలప్ చేసిందని అర్థం. ఒక వ్యక్తికి తన ఇంటితో, తన ఫ్యామిలీతో ఎలాంటి ఎటాచ్‌ మెంట్‌ ఫీల్‌‌ అవుతాడో… అలాంటి ఎటాచ్‌మెంట్‌నే తన కంపెనీతో, తన టీమ్‌ తో ఫీల్ అవగలిగితే..ప్రొడక్టివిటీ పెరుగుతుంది. కంఫర్టబుల్‌ ‌ఎన్వి రాన్‌ మెం ట్‌ తో ఆఫీసు మీద ఇలాంటి సానుభూతి క్రియేట్‌ చే స్తే… ఎంప్లాయిస్‌ ఉత్సాహంగా పని చేస్తారు. సక్సెస్‌ ని తీసుకొస్తారు అంటారు టాటా.

ఎంప్లాయిస్ని తీసేస్తే

లాక్‌‌డౌన్‌ తర్వాత చాలామంది తమ జాబ్స్‌ కోల్పోయారు. ఎంప్లాయిస్‌ ని తొలగించొద్దని ప్రధానమంత్రి చెప్పినప్పటికీ.. చాలా ఆర్గనైజేషన్స్‌ తమ ఎంప్లాయిస్‌ ని తీసేశాయి. కానీ, రతన్ టాటా దీన్ని నమ్మరు. ‘ ఎంప్లాయిస్‌ ని తీసేయడం వల్ల మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? కచ్చితంగా కాదు. వాళ్లకిది టఫ్ టైమ్‌ . ఈ టైమ్‌ లో మీ మనుషులను మీరు నమ్మండి అనే నేను సూచిస్తాను” అంటారు టాటా. రతన్‌ టాటా చెప్పిన ఈ ఐదు గోల్డెన్ రూల్స్‌ ని ఫాలో అయినవాళ్లు కచ్చితంగా సక్సెస్‌ ఫుల్‌‌ బిజినెస్‌ లీడర్స్‌ గా పేరు తెచ్చుకుంటారు. అంతేకాదు, అన్నింటి కంటే ముఖ్యం గా వీళ్లకు క్రెడిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. కోవిడ్ ‌‌లాంటి క్రైసిస్‌ ని కూడా ఈజీగా ఫేస్ చేస్తారు.