బోరబండ గవర్నమెంట్ జూనియర్‌‌‌‌ కాలేజీలో ..మౌలిక వసతులపై హెచ్ఆర్సీ ఆదేశాలు

బోరబండ గవర్నమెంట్ జూనియర్‌‌‌‌ కాలేజీలో ..మౌలిక వసతులపై హెచ్ఆర్సీ ఆదేశాలు

పద్మారావునగర్, వెలుగు: బోరబండ గవర్నమెంట్ జూనియర్‌‌‌‌ కాలేజీలో మౌలిక వసతుల కొరతపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌‌‌‌ కీలక ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాది రామారావు ఇమ్మానేని దాఖలు చేసిన పిటిషన్​పై కమిషన్‌‌‌‌ చర్యలు చేపట్టింది. తక్షణమే బోరబండ కాలేజీలో టాయిలెట్ల రిపేర్లు, శుభ్రతకు కార్మికుల కేటాయింపు, లెక్చరర్ల సంఖ్య పెంపు, తాగునీటి సదుపాయాల వంటి మౌలిక వసతులు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.