రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు ఇప్పుడు పేలింది

రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు ఇప్పుడు పేలింది

ఇంగ్లండ్‌లోని నార్ ఫోల్క్ కౌంటీలో రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటు బాంబు పేలింది. రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి బాంబును గుర్తించి డిఫ్యూజ్ చేస్తుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.  నార్ ఫోల్క్ కౌంటీలోని గ్రేట్ యార్‌మౌత్‌ టౌన్‌లో పాతకాలం నాటి పేలని బాంబును అధికారులు గుర్తించారు. దానిని డిఫ్యూజ్ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే ముందు జాగ్రత చర్యల్లో భాగంగా చుట్టుపక్కల ఉన్న జనాలను అక్కడి నుంచి తరలించారు. మనుషులతో కాకుండా రోబోలతో డిఫ్యూజ్ చేయాలని నిర్ణయించారు. ఈ ప్రయత్నంలో బాంబు పేలి భారీ విస్పొటనం జరగింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపిన అధికారులు ఆస్తినష్టం ఎంత జరిగిందన్న దానిపై వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. 

అయితే విస్ఫోటనం కారణంగా భారీగా దుమ్ము, ధూళి గాల్లోకి ఎగిసిపడింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు డ్రోన్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. నార్ ఫోల్క్ అధికారులు ఈ వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. “ బాంబును డిఫ్యూజ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా భారీ పేలుడు సంభవించింది. ఈ దృశ్యాల్ని మా డ్రోన్ కెమెరా రికార్డ్ చేసింది. అయితే.. అంతకుముందే అక్కడి నుంచి జనాల్ని తరలించడంతో, ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు ’’ అని ట్వీట్ చేశారు.