టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంతకి తన వీరాభిమాని గుడి కట్టించాడు. ఏప్రిల్ 28 సమంత పుట్టినరోజు సందర్బంగా ఈ గుడిని ప్రారంభించాడు. బాపట్ల జిల్లా ఆలపాడుకు చెందిన సందీప్ అనే వ్యక్తికి సమంత అంటే చాలా ఇష్టం. అందుకే.. ఆమె మయోసైటిట్ బారిన పడిందని తెలిసి చాలా బాధపడ్డాడట సందీప్. ఆ వ్యాధి నుండి సమంత త్వరగా కోలుకోవాలని తిరుపతి, చెన్నై, నాగపట్నం మీదుగా మొక్కుబడి యాత్ర కూడా చేశాడు.
ఇలా సామ్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్న సందీప్.. ఇప్పుడు మరో అడుగు ముందుకేశాడు. సమంతకు గుడి కట్టించేసాడు. అదికూడా ఎక్కడో కాదు తన ఇంట్లోనే. శుక్రవారం సమంత పుట్టినరోజు లోపు సందర్భంగా అంగరంగ వైభవంగా ఆ గుడిని ప్రారంభించాడు. కేక్ కట్ చేసి సమంతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. అంతేకాదు.. గుడి ప్రారంభోత్సవానికి వచ్చిన వారందరికీ ప్రత్యేక విందు కూడా ఏర్పాటు చేసాడు.
అయితే.. సందీప్ ఇవన్నీ చేయడానికి కారణం సమంతలో ఉన్న సేవ గుణమేనట. నటిగా కన్న సమంతలో సేవా కార్యక్రమాలే సందీప్ ని ఇంతలే ప్రేరేపించినట్లు తెలిపాడు. అనారోగ్యానికి గురైన ఎంతోమంది పిల్లలకు పునర్జన్మ ప్రసాదిస్తున్న సమంతపై అభిమానం రెట్టింపయ్యిందని, అందుకే ఆమెకు గుడి కట్టానని సందీప్ తెలిపాడు. ఇక ఈ వార్త తెలుసుకున్న చుట్టుపక్కల జనాలు సమంత గుడిని చూడటానికి సందీప్ ఇంటికి చేరుకుంటున్నారు.