ఇండియాలో టాప్ 50 వెబ్ సిరీస్‌లో ఒకటైన ‘మహారాణి’ (Maharani) వెబ్ సీరీస్.. ఎంత ఫేమస్ అనేది అందరికీ తెలిసిందే. పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లలో మహారాణి వెబ్ సిరీస్ ముందు వరసలో ఉంటుంది. బీహార్ రాజకీయాల చుట్టూ ఆసక్తిగా తిరిగే ఈ సిరీస్.. ఫస్ట్ మూడు సీజన్లు సూపర్ డూపర్ సక్సెస్ అందుకున్నాయి. ఇపుడు మహారాణి వెబ్ సీరీస్ నాలుగో సీజన్ (Maharani 4) ఓటీటీకి వచ్చేస్తుంది.
బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి ప్రధానపాత్రలో నటించిన ఈ సిరీస్ సీజన్ 4 ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా సీజన్ 4 నవంబరు 7 నుంచి సోనీ లివ్ (Sony LIV)లో స్ట్రీమింగ్ కానుందని తెలిపారు. బీహార్ రాజకీయాలను కళ్లకు కడుతున్న ఈ సిరీస్, ప్రతి సీజన్కు ఉత్కంఠ రేపుతూ వెళ్తుంది. తొలి మూడు సీజన్స్లలో హుమా ఖురేషీ 'రాణీ భారతి' పాత్రలో అదరగొట్టింది. ఇపుడు నాలుగో సీజన్‌లో కూడా ఆమె పాత్రను మరింత బలంగా తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. అయితే, ఈ నాలుగో సీజన్ ద్వారా ‘బీహార్ వర్సెస్ ఢిల్లీ’ అనేలా రసవత్తరమైన ఫైట్ ఉండేలా కనిపిస్తోంది.
ఈ మహారాణి వెబ్ సిరీస్ను సుభాష్ కపూర్ క్రియేట్ చేయగా.. సౌరభ్ భావే దర్శకత్వం వహించాడు. నందన్ సింగ్ మరియు ఉమాశంకర్ సింగ్ లతో కలిసి సుభాష్ కపూర్ ఈ సిరీస్ కుస్టోరీని అందించాడు. తొలి సీజన్ ను కరణ్ శర్మ డైరెక్ట్ చేయగా.. రెండో సీజన్ ను రవీంద్ర గౌతమ్, మూడో సీజన్ ను సౌరభ్ భవే డైరెక్ట్ చేశారు. నాలుగో సీజన్ ను పునీత్ ప్రకాష్ తెరకెక్కించాడు.
వాస్తవానికి పొలిటికల్ వార్ బయట ఎలా ఉందో.. ఇలాంటి టైములో మహారాణి వెబ్ సీరిస్ వస్తుండటంతో ఎలాంటి ప్రకంపనలు క్రియేట్ చేస్తుందో అని కొంతమంది రాజకీయ నాయకుల్లో అలజడి మొదలైంది. ఇకపోతే, మహారాణి ఫస్ట్ సీజన్ 2021లో, ఆ తర్వాత 2022లో రెండో సీజన్, 2024లో మూడో సీజన్ స్ట్రీమింగ్ అయ్యాయి.
