కరోనా వైరస్ వ్యాక్సిన్ ను మనుషులపై ప్రయోగిస్తున్నారు

కరోనా వైరస్ వ్యాక్సిన్ ను మనుషులపై ప్రయోగిస్తున్నారు

యూకేలో మనుషులపై కరోనా వైరస్ వ్యాక్సిన్ ప్రయోగం ప్రారంభమవుతుందని ఆ దేశ హెల్త్ మినిస్టనర్ మాట్ హాన్‌కాక్  తెలిపారు.  ప్రయోగంపై మాట్   మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనుషులపై కరోనా వైరస్ వ్యాక్సిన్ 80 శాతం ఫలితాలు విజయవంతం అవుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. పరిశోధనల్ని విజయవంతం చేసేందుకు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ సైంటిస్ట్ లు నిర్విరామంగా కృషిచేస్తున్నారన్నారు. ఆక్స్ ఫర్డ్ తో పాటు ఇంపిరీయల్ కాలేజ్ సైంటిస్ట్ లు పరిశోధనలు చేస్తున్నారని, ఇందుకు 20మిలియన్లను కేటాయించినట్లు చెప్పారు.

ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ సైంటిస్ట్ లు ట్రయల్స్ పూర్తయ్యే లోపల పెద్దమొత్తంలో వ్యాక్సిన్ తయారు చేసేలా ప్లాన్ చేస్తున్నారని, సెప్టెంబర్ నాటికి ఒక మిలియన్ టీకాలు సిద్ధంగా ఉంటాయన్నారు. ఈలోగా కరోనా ను అడ్డుకునేందుకు లాక్ డౌన్ , సోషల్ డిస్టెన్స్ పాటించడమే ప్రత్యామ్నాయ మార్గాలని హెల్త్ మినిస్టర్ తెలిపారు.

మాట్ ప్రకటనను  బ్రిటిష్ మెడికల్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ చాంద్ నాగ్‌పాల్  స్వాగతించారు. కరోనావైరస్ వ్యాక్సిన్ కోసం పరీక్షలు ప్రారంభమవుతున్నాయని, ఆ పరిశోధనలు సానుకూలంగా ఉంటాయన్నారు.  వ్యాక్సిన్‌ను వీలైనంత త్వరగా అభివృద్ధి చేయడానికి  సమిష్టిగా కృషి చేస్తున్నామని, వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే కరోనాను అడ్డుకుంటామని నాగ్ పాల్ తెలిపారు.