లిక్కర్ స్కామ్ లో వందల కోట్ల అవినీతి : తరుణ్ చుగ్

లిక్కర్ స్కామ్ లో వందల కోట్ల అవినీతి : తరుణ్ చుగ్

లిక్కర్ స్కామ్ లో వందల కోట్ల అవినీతి జరిగిందని బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ఆరోపించారు.  దర్యాప్తు సంస్థలకు సోనియా గాంధీ అయినా, కేసీఆర్ అయిన ఒకటేనని అన్నారు.  లిక్కర్ స్కామ్ లో కవిత నిజాలు చెప్పాలని  డిమాండ్  చేశారు. కవితపై బండి సంజయ్ చేసిన  వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని  తరుణ్ చుగ్ తెలిపారు. మరోవైపు  లిక్కర్ స్కామ్ లో కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.  గత ఐదు గంటలు పైగా విచారణ కొనసాగుతోంది. పిళ్లై, సిసోడియా, కవితను కలిపి అధికారులు ప్రశ్నిస్తున్నారు. 

బండి సంజయ్ పై  రాష్ట్ర మహిళా కమిషన్  సీరియస్ అయ్యింది. ఎమ్మెల్సీ కవితపై వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ బండి సంజయ్ విచారణకు డీజీపీని ఆదేశించింది. వ్యక్తిగతంగా హాజరుకావాలని  బండి సంజయ్ ను మహిళా కమిషన్ ఆదేశించనుంది. బండి సంజయ్ వ్యాఖ్యలు మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయంటూ  మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.