యూరప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వడ్డీ రేట్లను తగ్గించే మొదటి దేశం హంగేరి!

యూరప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వడ్డీ రేట్లను తగ్గించే మొదటి దేశం హంగేరి!

న్యూఢిల్లీ: యూరప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఓ చిన్న దేశం వడ్డీ రేట్లను తగ్గించడానికి రెడీ అవుతోంది. వరసగా ఆరు పాలసీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో  వడ్డీ రేట్లను హంగేరి సెంట్రల్ బ్యాంక్ హంగేరియన్ నేషనల్ బ్యాంక్ మార్చకుండా ఉంచింది. వచ్చే వారం జరగనున్న మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని అక్కడి మీడియా పేర్కొంటోంది.

ప్రస్తుతం ఈ దేశంలో బేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వడ్డీ రేటు 13 శాతంగా ఉంది. హంగేరియన్ సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బర్నబస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విరగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా కొలేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కూడిన లోన్ల రేట్లను ప్రస్తుతం ఉన్న 25 శాతం నుంచి తగ్గిస్తామని ప్రకటించారు. యూరప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ పీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకుందని చాలా మంది ఎనలిస్టులు చెబుతున్నారు. ఒకవేళ వడ్డీ రేట్లను తగ్గిస్తే 2021 తర్వాత యూరప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వడ్డీ రేట్లు తగ్గించిన మొదటి దేశంగా హంగేరి  నిలుస్తుంది.