యూట్యూబ్‌లో చూసి భార్యకు ప్రసవం చేసిన భర్త.. కానీ

యూట్యూబ్‌లో చూసి భార్యకు ప్రసవం చేసిన భర్త.. కానీ

తమిళనాడులోని కృష్ణగిరిలో 27 ఏళ్ల మహిళ ప్రసవ సమయంలో తీవ్ర రక్తస్రావం కారణంగా మరణించింది. ఆమె భర్త యూట్యూబ్‌లో నేర్చుకున్న టెక్నిక్‌ని ఉపయోగించి.. ఇంట్లోనే సహజ ప్రసవానికి ప్రయత్నించాడు. బొడ్డు తాడును సరిగ్గా కోయకపోవడంతో ఆ మహిళకు తీవ్ర రక్తస్రావం అయినట్టు నివేదికలు సూచిస్తున్నాయి. పోచంపల్లి సమీపంలోని పులియంపట్టికి చెందిన లోగనాయకి మృతిపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) వైద్యాధికారి రాధిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసు వర్గాల కథనం ప్రకారం, లోగనాయకి భర్త మాధేష్ ఆమెకు ప్రసవ నొప్పి రావడంతో ఇంట్లోనే ప్రసవించారు. ప్రసవ సమయంలో బొడ్డు తాడు సరిగా కోయకపోవడంతో తీవ్ర రక్తస్రావం జరిగినట్లు తెలుస్తోంది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను పీహెచ్సీకి తీసుకురాగా, అక్కడికి చేరుకునేలోపే చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌పీసీ) సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశారు.