మద్యం తాగి స్కూల్ కు వెళ్తున్న టీచర్ల సస్పెన్షన్..విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న మరో టీచర్ పైనా వేటు

మద్యం తాగి స్కూల్  కు వెళ్తున్న టీచర్ల సస్పెన్షన్..విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న మరో టీచర్ పైనా వేటు
  • కరీంనగర్ డీఈవో ఉత్తర్వులు జారీ

కరీంనగర్, వెలుగు: మద్యం తాగి స్కూల్ కు వెళ్తున్న ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేస్తూ కరీంనగర్ డీఈఓ మొండయ్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. హుజురాబాద్ ప్రభుత్వ హైస్కూల్ లో ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ గా ఎ.సమ్మయ్య, పీఈటీ ఎ.ప్రవీణ్ కుమార్ రోజూ మద్యం తాగి డ్యూటీకి వెళ్తున్నారు. వీరిపై విద్యార్థులు, ఉపాధ్యాయుల నుంచి ఫిర్యాదులు అందాయి. దీంతో విచారణ చేపట్టిన అనంతరం డీఈఓ సస్పెండ్ చేశారు. ఇదే మండలంలోని చెల్పూర్ జెడ్పీ హైస్కూల్  ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ ఎం.ఐలయ్య డ్యూటీలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఫిర్యాదుతో రిపోర్టు ఆధారంగా డీఈఓ సస్పెండ్ చేశారు.