ఏసీబీకి చిక్కిన హుజూరాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్

ఏసీబీకి చిక్కిన హుజూరాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్

హనుమకొండ జిల్లాలో ఓ అవినీతి చేప ఏసీబీ అధికారులకు చిక్కింది. డ్రైవర్ ఛార్జ్ మెమో ఎత్తేయడానికి లంచం డిమాండ్ చేసిన హుజూరాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఆర్టీసీ డ్రైవర్ నుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. హుజూరాబాద్ డిపోకు చెందిన డ్రైవర్ తాటికొండ రవీందర్ ఇటీవల డిపో మేనేజర్ శ్రీకాంత్ చార్జిమెమో ఇచ్చారు. మెమో ఎత్తేయాలంటే  30వేల రూపాయలు లంచంగా ఇవ్వాలని శ్రీకాంత్ డిమాండ్ చేశారు. రవీందర్ ఇప్పటికే 10వేల రూపాయలు ఇచ్చినప్పటికీ మిగతా డబ్బుకోసం శ్రీకాంత్ ఒత్తడి చేశాడు. దీంతో డ్రైవర్ రవీందర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రవీందర్ నుంచి రూ. 20 వేలులంచం తీసుకుంటుండగా  ఏసీబీ అధికారు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.