స్కైరూట్ ఏరోస్పేస్ టీంకు మంత్రి కేటీఆర్ ఆల్ దిబెస్ట్..

స్కైరూట్ ఏరోస్పేస్ టీంకు మంత్రి కేటీఆర్ ఆల్ దిబెస్ట్..

హైదరాబాద్ బేస్డ్ ఏరోస్పేస్ స్టార్టప్ కంపెనీ స్కైరూట్ స్వదేశీయంగా నిర్మించిన విక్రమ్1 రాకెట్ను మంగళవారం (అక్టోబర్24) ఆవిష్కరించింది. వచ్చే ఏడాది (2024) ప్రారంభంలో తక్కువ భూకక్ష్యలోకి ఉపగ్రహాలను చేరవేసే లక్ష్యంతో విక్రమ్1 రాకెట్ ను ప్రయోగించనున్నారు. హైదరాబాద్ ఐటీహబ్ సహకారంతో  ఎదిగిన స్కైరూట్ అంతరిక్ష రంగంలో పరిశోధనలకు కీలకంగా మారడం గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా భూకక్ష్యలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టే సామర్థ్యం ఉన్న ప్రైవేట్ రాకెట్లలో విక్రమ్ 1 ఒకటిగా ఉండటం గర్వించదగ్గ విషయం అన్నారు కేటీఆర్. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ స్కైరూట్ టీంను అభినం దించారు. 

విక్రమ్ 1 భూ కక్ష్యలో దాదాపు 300 కిలోల పేలోడ్ లను ఉంచగల సామర్థ్యం ఉన్న ఏడంచెల రాకెట్.. ఇది ఆల్ కార్బన్ ఫైబర్ బాడీడ్ రాకెట్. ఇది 3Dప్రింటెడ్ లిక్విడ్ ఇంజిన్ లను కలిగి ఉండి.. మల్టీపుల్ శాటిలైట్ లను భూక్ష్యలో ఉంచగలదు. 

ALSO READ :- లోకేష్ పప్పు అని మరోసారి రుజువైంది: మాజీ మంత్రి కొడాలి నాని

MAXQ అని పేరుతో హైదరాబాద్ లో స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ తన కొత్త ప్రధాన కార్యాలయం క్యాంపస్ ని  నిన్న ( అక్టోబర్ 24) ప్రారంభించింది. 60వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక మౌలిక సదుపాయాలతో ఈ కొత్త ఆఫీస్ నిర్మించబడింది. ఈ సంస్థలో దాదాపు 300 మంది సభ్యులున్నారు.