జూలై 19న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ ఏజీఎం

జూలై 19న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ ఏజీఎం

హైదరాబాద్, వెలుగు:  హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏ) వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) ఈ నెల19న జరుగుతుందని ఆ సంఘం తాత్కాలిక ప్రెసిడెంట్ దల్జీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్ బుధవారం ప్రకటించారు. గత నెల 29న జరిగి వాయిదా పడిన 87వ ఏజీఎంకు కొనసాగింపుగా ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. శనివారం ఉదయం 10.30 గంటల నుంచి ఉప్పల్ స్టేడియంలో ఈ ఏజీఎం జరుగుందన్నారు. ఎజెండాలో రెండు ముఖ్య అంశాలుగా అంబుడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎథిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్ నియామకాలను చేర్చినట్టు పేర్కొన్నారు. 

చట్టబద్ధమైన నిబంధనలను పాటిస్తూ, పారదర్శక పాలనను తీసుకురావడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమని దల్జీత్ సింగ్ వెల్లడించారు. హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏ సభ్యులందరూ ఈ సమావేశానికి హాజరు కావాలని ఆయన కోరారు. ఫోర్జరీ, నిధుల దుర్వినియోగం కేసులో హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జగన్ మోహన్ రావు, ట్రెజరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీజే శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అరెస్టయిన తర్వాత  జరగబోతున్న ఈ ఏజీఎం ప్రాధాన్యత సంతరించుకుంది.