
సిటీలో ఎక్కడ చూసినా గణేశ్ సందడే కనిపిస్తున్నది. చిన్నా పెద్దా అంతా వినాయక చవితి ఏర్పాట్లలో పూర్తిగా నిమగ్నమయ్యారు. నగరవ్యాప్తంగా మండపాల నిర్మాణం, భారీ గణేశ్ విగ్రహాల తరలింపు జోరుగా సాగుతోంది. ‘ఆగమనం’ పేరుతో గ్రాండ్గా ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. బ్యాండ్, ఆట పాటలు, పటాకులతో గణనాథుడిని మండపాలకు తీసుకొస్తున్నారు. మరోవైపు గణేశ్విగ్రహాల కొనుగోళ్లతో సిటీలోని ప్రధాన మార్కెట్లు కిక్కిరిస్తున్నాయి.