ఏనుగు మృతిపై కేరళ సీఎంకు మెయిల్ ​పెట్టిన హైదరాబాదీ​

ఏనుగు మృతిపై కేరళ సీఎంకు మెయిల్ ​పెట్టిన హైదరాబాదీ​

చంపిన వారి ఆచూకీ చెబితే రూ. 2 లక్షల రివార్డ్

హైదరాబాద్​/ తిరువనంతపురం: సంచలం కలిగించిన కేరళ ఏనుగు మృతికి సంబంధించిన నిందితుల సమాచారం చెప్పిన వారికి రూ. 2 లక్షల నజరానాను ప్రకటించారు హైదరాబాద్​కు చెందిన బి.టి. శ్రీనివాసన్​. ఈ మేరకు కేరళ సీఎం పినరయి విజయన్​కు మెయిల్​ పంపించానని ఆయన చెప్పారు. ఏనుగు చావుకు కారణమైన వ్యక్తిని గుర్తించిన వారిని తాను కేరళవెళ్లి కలుసుకుంటానని కూడా ఆయన అన్నారు. శ్రీనివాసన్​ గ్రేటర్​హైదరాబాద్ యునైటెడ్​ ఫెడరేషన్​ ఆఫ్​ రెసిడెంట్​ వెల్ఫేర్​ అసోసియేషన్స్​ జనరల్​ సెక్రటరీగా ఉన్నారు.

హత్య కేసులో నిందితుడి అరెస్ట్

మరోవైపు, గర్భంతో ఉన్న ఏనుగు మృతికి కారకుడైన ఒకరిని అరెస్టు చేసినట్లు కేరళ ఫారెస్ట్​ మినిస్టర్​ శుక్రవారం మీడియాకు చెప్పారు. అడవి పందుల నుంచి పంటలను కాపాడేందుకు పెట్టిన బెల్లం పూసిన నాటుబాంబును తిని ఏనుగు చనిపోయి ఉండవచ్చునని ఫారెస్ట్​ అధికారులు చెప్పారు. అరెస్టయిన వ్యక్తి ఇతరుల కోసం నాటు బాంబును స్వయంగా తయారు చేసి ఇచ్చాడని పాలక్కడ్ జిల్లా పోలీసు చీఫ్ తెలిపారు. ఈ కేసులో మరింతమంది నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు.

Hyderabad man announces reward for providing info about culprits in Kerala elephant death case