ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయ్ సాక్స్ లో గోల్డ్ బిస్కెట్.. 

ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయ్ సాక్స్ లో గోల్డ్ బిస్కెట్.. 

వింత వింత ఐడియాలతో బంగారం స్మగ్లింగ్ జరుగుతుంది. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి అన్నట్లు.. విదేశాల నుంచి బంగారాన్ని తీసుకొస్తున్నారు కొందరు. షూ సాక్స్ లో బంగారం బిస్కెట్ పెట్టుకుని వచ్చిన ఓ వ్యక్తిని హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఏప్రిల్ 21వ తేదీ శుక్రవారం జరిగిన ఘటన ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 

జెడ్డా నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఓ వ్యక్తి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నట్లు అనుమానించారు కస్టమ్స్ ఆఫీసర్స్. ఈ క్రమంలోనే అతన్ని తరవుగా చెక్ చేశారు. షాకింగ్.. సాక్స్ ‌‌– అరికాలు మధ్యలో 250 గ్రాముల బంగారం బిస్కెట్ ఉన్నట్లు గుర్తించారు. దీని విలువ 15 లక్షల రూపాయలు. దీనికి ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ కట్టలేదు. అనధికారికంగా తీసుకొస్తున్నట్లు గుర్తించి.. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అధికారులు. 

అరికాలు మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ లోనే ఈ బిస్కెట్ ను తెలివిగా సర్దేశాడు ఆ వ్యక్తి. జెడ్డా విమానాశ్రయంలో ఈ బంగారం బిస్కెట్ కొనుగోలు చేసినట్లు చెబుతున్నాడు. దీనిపై విచారణ చేస్తున్నారు అధికారులు.