బాలీ: ఆసియా యూత్ చెస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ ప్లేయర్ పుంగవనం సంహిత బ్రాంజ్ మెడల్‌తో మెరిసింది. శనివారం జరిగిన బ్లిట్జ్ ఫార్మాట్‌లో ఏడు రౌండ్లకుగాను సంహిత 6.5 పాయింట్లను సాధించింది. టీమ్ చాంపియన్‌షిప్‌లో ఇండియా మూడు గోల్డ్ మెడల్స్‌ను కైవసం చేసుకుంది. చార్వి (కర్ణాటక), పూజ శ్రీ (తమిళనాడు)తో జత కట్టిన సంహిత.. స్టాండర్డ్, ర్యాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్‌లో ఇండియాకు గోల్డ్ మెడల్స్ అందించింది.
