సైబర్ మోసాలపై హైదరాబాద్ పోలీసుల కొత్త నిర్ణయం

సైబర్ మోసాలపై హైదరాబాద్ పోలీసుల కొత్త నిర్ణయం
  • ఫిర్యాదు స్థాయిని బట్టి కేసులు పోలీసు స్టేషన్లకు బదలాయింపు
  • హైదరాబాద్ సీసీఎస్ జాయింట్ సీపీ అవినాష్ మహంతి

హైదరాబాద్: సైబర్ మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు రోజురోజుకు ఎక్కువవుతున్న నేపధ్యంలో హైదరాబాద్ పోలీసులు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఫిర్యాదు స్థాయిని బట్టి కేసులను పోలీస్ స్టేషన్లకు బదలాయింపు చేయాలని నిర్ణయించినట్లు సీసీఎస్ జాయింట్ సీపీ అవినాష్ మహంతి వెల్లడించారు. లక్ష రూపాయల లోపు మోసాలకు సంబందించిన కేసులను బాధితులు నివసించే ప్రాంతం పరిధిలోని పోలీస్ స్టేషన్లకు బదలాయింపు( ట్రాన్స్ ఫర్) చేస్తామన్నారు. అయితే ఫిర్యాదులు మాత్రం సైబర్ క్రైమ్స్ పోలీసు స్టేషన్లోనే స్వీకరిస్తామని, వాటిని ఇక్కడ నమోదు చేసి సంబంధిత పోలీసు స్టేషన్లకు పంపిస్తామని సైబర్ క్రైమ్స్ ఏసీపీ కేవీఎమ్ ప్రసాద్ వెల్లడించారు. కేసు దర్యాప్తు వివరాలు బాధితులు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లోనే తెలుసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.