ఆఫీస్ స్పేస్లో హైదరాబాద్ రికార్డ్.. జనవరి–జూన్లో లీజింగ్ 63 శాతం జంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఆఫీస్ స్పేస్లో హైదరాబాద్ రికార్డ్.. జనవరి–జూన్లో లీజింగ్ 63 శాతం జంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • పెద్ద  సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసులకే మెజారిటీ సంస్థలు మొగ్గు
  • జరిగిన మొత్తం లీజులో 65 శాతం వీటి వాటానే 
  • నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ వెల్లడి

హైదరాబాద్, వెలుగు:  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్ స్పేస్ ఈ ఏడాది   ఊహించని రీతిలో పుంజుకుంది. ముఖ్యంగా లక్ష చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న పెద్ద సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్ స్థలాలకు ఫుల్ డిమాండ్ కనిపించింది.   అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ 'నైట్ ఫ్రాంక్ ఇండియా'  రిపోర్ట్ ప్రకారం, ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఈ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  లీజింగ్ లావాదేవీలు ఏకంగా 63 శాతం పెరిగాయి.  

కిందటేడాది మొదటి ఆరు నెలల్లో 30 లక్షల చదరపు అడుగులుగా ఉన్న  లార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్ స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీజింగ్, ఈ ఏడాది  మొదటి ఆరు నెలల్లో ఏకంగా 49 లక్షల చదరపు అడుగులకు  చేరింది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన మొత్తం ఆఫీస్ లీజింగ్ లావాదేవీల్లో  ఈ ఒక్క సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాటానే  65 శాతం ఉండడం గమనార్హం.  సిటీలో ఆఫీస్ స్థలాల సగటు డీల్ సైజ్ కూడా  2025 జనవరి–జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని 70,537 చదరపు అడుగుల నుంచి ఈ ఏడాది జనవరి–జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాటికి 93,516 చదరపు అడుగులకు చేరింది. దీనిని బట్టి సిటీలో బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు వేగంగా విస్తరిస్తున్నాయని అర్థం చేసుకోవచ్చు. 

ఐటీ, డేటా సెంటర్లతో డిమాండ్‌‌‌‌

మిడ్-సైజ్ ఆఫీస్ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో  14 లక్షల చదరపు అడుగుల లీజింగ్ నమోదు కాగా, చిన్న ఆఫీస్ స్థలాల (50 వేల చదరపు అడుగుల కంటే తక్కువ) వాటా 12 లక్షల చదరపు అడుగులుగా ఉంది.

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మౌలిక వసతులు మెరుగుపడుతుండడం, ట్యాలెంట్‌‌‌‌  అందుబాటులో ఉండడం,  ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగా ఉండడంతో  ఐటీ, డేటా సెంటర్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ) లు సిటీకి వస్తున్నాయి. "హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మొత్తం లీజింగ్ సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంత వేగంగా పెరగడంలో పెద్ద  ఆఫీస్ డీల్స్ కీలకంగా ఉన్నాయి. కొత్త ఆఫీస్ స్థలాలు వేగంగా అందుబాటులోకి వస్తున్నా, ఖాళీగా ఉన్న స్థలాలు  తగ్గుముఖం పడుతున్నాయి.  

అద్దెలు స్థిరంగా పెరుగుతుండటం చూస్తే   సిటీలో డిమాండ్ ఉందని తెలుస్తోంది.  మౌలిక సదుపాయాలు మెరుగవ్వడం, ట్యాలెంట్, కాస్ట్ కాంపిటీటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్ కారణంగా మున్ముందు కూడా ఈ వృద్ధి  కొనసాగుతుందని భావిస్తున్నాం" అని నైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్రాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జోసెఫ్ తిలక్  తెలిపారు. హైదరాబాద్ ఆఫీస్ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో  మొత్తం 75 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్థలాల లావాదేవీలు జరిగాయి. వివిధ సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల  లీజు  వివరాలు  చదరపు అడుగుల్లో ఇలా ఉన్నాయి. 

కేటగిరీ (చ.అ.)    లీజు     మొత్తం ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వాటా
50 వేల కంటే తక్కువ    12 లక్షలు    16శాతం
50 వేలు– లక్ష    14 లక్షలు    19 శాతం
లక్ష కంటే ఎక్కువ     49 లక్షలు     65 శాతం