ఇంటర్​ ఫలితాల్లో.. ​ హైదరాబాద్ లో స్టూడెంట్లు సత్తా

ఇంటర్​ ఫలితాల్లో.. ​  హైదరాబాద్ లో స్టూడెంట్లు సత్తా
  • ఫస్ట్​ ఇయర్​లో రంగారెడ్డి జిల్లాకు స్టేట్​ ఫస్ట్, మేడ్చల్​కు సెకండ్ ​ర్యాంకులు
  • సెకండ్ ​ఇయర్​లో మేడ్చల్​కు సెకండ్, రంగారెడ్డికి థర్డ్ ​ర్యాంకులు 

హైదరాబాద్, వెలుగు : ఇంటర్​మీడియట్ ఫలితాల్లో గ్రేటర్ ​స్టూడెంట్లు సత్తా చాటారు. రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల స్టూడెంట్లు స్టేట్ ర్యాంకులు సాధించారు. హైదరాబాద్​జిల్లా స్టూడెంట్లు పర్వాలేదనిపించారు. ఫస్ట్​ఇయర్​ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే టాప్ ప్లేస్​లో నిలిచింది. మేడ్చల్ జిల్లాకు రెండో స్థానం దక్కించుకుంది. సెకండ్​ఇయర్ ఫలితాల్లో మేడ్చల్​జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలవగా, రంగారెడ్డి జిల్లా మూడో స్థానం దక్కించుకుంది. మూడు జోన్లు కలిపి హైదరాబాద్​జిల్లా ఫస్ట్​ఇయర్ లో 10 స్థానం, సెకండ్​ఇయర్​లో13వ స్థానంలో నిలిచింది.

వికారాబాద్​జిల్లా ఫస్ట్​ఇయర్​లో 22వ స్థానం, సెకండ్ ఇయర్ ఫలితాల్లో 27వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 71.70 శాతం ఉత్తీర్ణతతో రంగారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే టాప్​ప్లేస్​లో నిలిచింది. 71.58 శాతంతో మేడ్చల్​జిల్లా రెండో స్థానంలో నిలిచింది. హైదరాబాద్​జిల్లా 59.90 శాతంతో పదో స్థానం దక్కించుకుంది. వికారాబాద్​జిల్లాలో 53.11శాతం మంది పాస్ అయ్యారు. అలాగే సెకండ్​ఇయర్​ఫలితాల్లో 79.31 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్​జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో, రంగారెడ్డి జిల్లా 77.63 శాతంతో మూడో స్థానంలో నిలిచింది. హైదరాబాద్​లోని మూడు జోన్ల పరిధిలో 65.85 శాతం మంది, వికారాబాద్ జిల్లాలో 61.08 శాతం మంది పాస్​అయ్యారు. 

అమ్మాయిలదే హవా..

ఇంటర్​ఫస్ట్, సెకండ్​ఇయర్​ఫలితాల్లో అమ్మాయిలే పైచేయి సాధించారు. ఫస్ట్​ఇయర్​లో.. మేడ్చల్ జిల్లాలో 77.46 శాతం మంది అమ్మాయిలు, 66.66 శాతం అబ్బాయిలు పాస్​అయ్యారు. రంగారెడ్డి జిల్లాలో 76.74 శాతం మంది అమ్మాయిలు, 67.18 శాతం మంది అబ్బాయిలు ఉత్తీర్ణత సాధించారు. హైదరాబాద్​లో 68.30 శాతం మంది బాలికలు, 51.49 శాతం మంది బాలురు, వికారాబాద్​లో 61.75 శాతం మంది బాలికలు, 43.23 శాతం మంది బాలురు పాస్ అయ్యారు. సెకండ్​ఇయర్​లో మేడ్చల్​జిల్లాలో 83.47 శాతం మంది అమ్మాయిలు, 75.87 శాతం మంది అబ్బాయిలు పాస్​అయ్యారు. 

రంగారెడ్డిలో 81.57 శాతం అమ్మాయిలు, 74.04 శాతం అమ్బాయిలు, హైదరాబాద్​జిల్లాలో 73.67శాతం మంది అమ్మాయిలు, 57.67 శాతం మంది అబ్బాయిలు, వికారాబాద్​జిల్లాలో 68.25 అమ్మాయిలు, 53.59 శాతం మంది అబ్బాయిలు ఉత్తీర్ణత సాధించారు. అలాగే ఒకేషనల్​కోర్సుల్లో ఫస్ట్​ఇయర్​లో హైదరాబాద్​జిల్లాలో 56.14  శాతం, రంగారెడ్డిలో 50.81 శాతం, మేడ్చల్ లో 54.03 శాతం, వికారాబాద్​లో 52.85 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. సెకండ్​ఇయర్​లో హైదరాబాద్​లో 69.32 శాతం, రంగారెడ్డిలో 62.02 శాతం, మేడ్చల్​లో 66.8 శాతం, వికారాబాద్​లో 67.55 శాతం విద్యార్థులు పాస్​ అయ్యారు. 

మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో మంచి ఫలితాలు

జిల్లాల వారీగా ఉత్తీర్ణత శాతం (ఫస్ట్​ఇయర్)
జిల్లా        అబ్బాయిలు        అమ్మాయిలు        మొత్తం
హైదరాబాద్​        51.49        68.30        59.90
రంగారెడ్డి          67.18        76.74        71.70
మేడ్చల్​        66.66        77.46        71.58
వికారాబాద్​        43.23        61.75        53.11
జిల్లాల వారీగా ఉత్తీర్ణత శాతం (సెకండ్ ఇయర్)
జిల్లా        అబ్బాయిలు        అమ్మాయిలు        మొత్తం
హైదరాబాద్​        57.67        73.67        65.85
రంగారెడ్డి          74.04        81.57        77.63
మేడ్చల్​        75.87        83.47        79.31
వికారాబాద్​        53.59        68.25        61.08