టూల్స్& గాడ్జెట్స్ : హెయిట్రల్‌‌ హ్యాండ్‌‌ స్టిచ్‌‌

టూల్స్& గాడ్జెట్స్ : హెయిట్రల్‌‌ హ్యాండ్‌‌ స్టిచ్‌‌

పిల్లలు ఎలాగంటే అలా ఎగిరి దుముకుతుండడం వల్ల వాళ్లు వేసుకునే బట్టల కుట్లు ఎక్కువసార్లు ఊడిపోతుంటాయి. కొన్ని సార్లు చిరిగిపోతాయి కూడా. అలాంటప్పుడు ఈ మెషిన్‌‌ ఉంటే టైలర్ దగ్గరికి పరిగెత్తకుండా ఇంట్లోనే కుట్లు వేసుకోవచ్చు. హైట్రల్‌‌ ఎలక్ట్రిక్‌‌ హ్యాండీ స్టిచ్‌‌ మెషిన్‌‌ని హైట్రల్‌‌ అనే కంపెనీ మార్కెట్‌‌లోకి తీసుకొచ్చింది. ఇది పోర్టబుల్‌‌ సైజ్‌‌లో స్టేప్లర్ స్టయిల్​లో వస్తుంది. దీంతో కుట్లు వేయడం చాలా సులభం. ముఖ్యంగా క్లాత్ బొమ్మలు, ప్యాచ్‌‌వర్క్, ఎంబ్రాయిడరీ, టెర్రీ క్లాత్​తో ఆర్ట్స్ క్రాఫ్ట్స్‌‌ తయారు చేయడం లాంటివి చేయొచ్చు. ఈ మెషిన్‌‌లో 4 AA బ్యాటరీలు వేసి లేదా ఈ మెషిన్‌‌తో పాటు వచ్చే ఎడాప్టర్‌‌‌‌ కనెక్ట్‌‌ చేసి కూడా వాడుకోవచ్చు. 

 ధర : 559 రూపాయలు 

స్టిర్రింగ్‌‌ కాఫీ మగ్‌‌

కొందరికి పాలలో కాఫీ పొడి వేసుకుని బాగా కలుపుకుని తాగడం అలవాటు. కానీ.. కప్పులో పోసి ఎక్కువసేపు కలపాలంటే విసుగ్గా అనిపిస్తుంది. అలాంటివాళ్ల కోసం ఇది బెస్ట్ కాఫీ మగ్‌‌. న్యాచ్‌‌కార్ట్‌‌ అనే కంపెనీ ఈ ఆటోమెటిక్‌‌ సెల్ఫ్‌‌ స్టిర్రింగ్‌‌ కాఫీ మగ్‌‌ని మార్కెట్‌‌లోకి తీసుకొచ్చింది. ఇందులో 400 మిల్లీలీటర్ల కాఫీ పడుతుంది. దీనిలోపల కాఫీని కలపడానికి ఒక చక్రం ఉంటుంది. స్విచ్‌‌ ఆన్‌‌ చేస్తే ఆ చక్రం స్పీడ్‌‌గా తిరుగుతుంది. ఆ చక్రానికి ఫ్లూయిడ్ మోటర్ కనెక్ట్‌‌ చేసి ఉంటుంది. దీన్ని కడగడం కూడా చాలా ఈజీ. కప్పులో నీళ్లు పోసి బటన్‌‌ నొక్కితే చాలు. ఇందులో  రెండు AAA బ్యాటరీలు వేయాలి. దీన్ని హై క్వాలిటీ స్టెయిన్‌‌లెస్ స్టీల్‌‌తో తయారు చేశారు. 

ధర : 399 రూపాయలు 

లాంచ్‌‌‌‌ ప్యాడ్‌‌ 

మనం చేయలేని చాలా పనులను కంప్యూటర్‌‌‌‌ సాయంతో చేస్తుంటాం. అయితే.. ఆ పనులను కూడా ఇంకాస్త స్పీడ్​గా చేయడానికి వీలుగా ఈ కాప్‌‌గెయిన్‌‌ హెచ్‌‌–3 స్ట్రీమ్‌‌ డాక్‌‌ని మార్కెట్‌‌లోకి తీసుకొచ్చారు. ఇది మల్టీ ఫంక్షనల్‌‌ గాడ్జెట్‌‌. కంప్యూటర్​కి కనెక్ట్‌‌ చేసి చాలా పనులను వేగంగా చేసుకోవచ్చు. ఇది కాంపాక్ట్ హై-పర్ఫార్మింగ్ స్ట్రీమ్ డాక్ అండ్‌‌ కనెక్టివిటీ హబ్‌‌గా పనిచేస్తుంది.  3.5-అంగుళాల టచ్‌‌ స్క్రీన్‌‌తో వస్తుంది. కంప్యూటర్‌‌‌‌లో ఇన్‌‌స్టాల్‌‌ చేసిన అప్లికేషన్‌‌లు దీనిలో కూడా డిస్‌‌ప్లే అవుతాయి. ఒకే టచ్‌‌తో ఆ యాప్‌‌ని ఓపెన్‌‌ చేయొచ్చు. దీన్ని మల్టీఫంక్షనల్ కీబోర్డ్‌‌గా కూడా వాడొచ్చు. వన్-టచ్ కమాండ్ షార్ట్‌‌కట్స్​ సెట్‌‌ చేసుకోవచ్చు. ఐకాన్ లైబ్రరీ కూడా అందుబాటులో ఉంది. దీనికి హెచ్‌‌డీఎంతోపాటు యూఎస్‌‌బీ పోర్ట్‌‌లు కూడా ఉంటాయి. వాటిలో రెండు హై-స్పీడ్ యూఎస్‌‌బీ 3.0 ఇంటర్‌‌ఫేస్‌‌లు ఉన్నాయి. ఎస్‌‌డీ కార్డ్‌‌ కూడా సపోర్ట్ చేస్తుంది. డూప్లికేట్ స్క్రీన్ డిస్‌‌ప్లే మోడ్ ఉంటుంది. ఇది100 వాట్స్‌‌ ఛార్జింగ్‌‌ అవుట్‌‌పుట్‌‌ ఇస్తుంది. మొబైల్స్‌‌ని చాలా స్పీడ్‌‌గా ఛార్జ్‌‌ చేసుకోవచ్చు. 

ధర : 11,000 రూపాయలు 

నేచురల్‌‌ మౌత్ వాష్

ఈ డివైజ్‌‌తో క్షణాల్లో నీళ్లను శుభ్రం చేసుకోవచ్చు. అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేసిన వాష్​వావ్‌‌ కప్‌‌– 2లో నీళ్లను పోస్తే.. అది నీటిలో క్లోరిన్‌‌ను ఎలక్ట్రోలైజ్ చేసి హెచ్‌‌సీఎల్‌‌ఓని తయారుచేస్తుంది. ఇది నోట్లోని చాలా రకాల బ్యాక్టీరియాను చంపేస్తుంది. ఈ నీళ్లతో ముఖ్యంగా దంత సమస్యలకు చెక్‌‌ పెట్టొచ్చు. రోజంతా తాజా శ్వాస వచ్చేలా చేస్తుంది. చిగుళ్ల ఆరోగ్యానికి సాయపడుతుంది. చిగుళ్ల సమస్యలతో బాధపడేవారికి ఇది బెస్ట్ చాయిస్‌‌. టూత్ బ్రష్‌‌ని ఈ కప్‌‌లో వేస్తే క్షణాల్లో శుభ్రం చేస్తుంది. పళ్ల సెట్లను కూడా ఇందులో వేసి కడుక్కోవచ్చు. ఇది సీఈ, ఎఫ్​సీసీ, ఈపీఏ సర్టిఫికెట్లు పొందింది. దీన్ని ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్‌‌తో తయారు చేస్తారు. 

ధర: 4,500 రూపాయలు