Hyundai Aura: హ్యుండాయ్ ఆరాలో అప్డేటెడ్ వెర్షన్

Hyundai Aura: హ్యుండాయ్ ఆరాలో అప్డేటెడ్ వెర్షన్

సెడాన్ మోడల్ ఆరాలో అప్ డేటెడ్ వెర్షన్ ను హ్యుండాయ్ లాంచ్ చేసింది. ఈ కారు ధర రూ.6.29 లక్షల నుంచి రూ.8.57 లక్షల మధ్య (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ) ఉంది. పెట్రోల్, సీఎన్ జీ వెర్షన్లలో కొత్త ఆరా కార్లు అందుబాటులో ఉన్నాయి. డీజిల్ వేరియంట్ ను తీసుకురావట్లేదని కంపెనీ ఇప్పటికే తెలిపింది. ఈ కారులో 30కి పైగా సేఫ్టీ ఫీచర్లను అమర్చామని కంపెనీ పేర్కొంది. స్టాండర్డ్ గా నాలుగు ఎయిర్ బ్యాగులను, ఆప్షనల్ గా ఆరు ఎయిర్ బ్యాగ్ లను అందిస్తున్నామని వివరించింది.