Chess Grandmaster Gukesh: ప్రపంచ చెస్ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష్ (D Gukesh) మైదానంలోనే కాదు, సోషల్ మీడియాలోనూ ప్రత్యర్థులకు మైండ్ బ్లాక్ అయ్యేలా షాక్ ఇవ్వగలడని ప్రూవ్ చేసుకున్నాడు. ఇటీవల ఒక నెటిజన్ గుకేష్‌ను ఉద్దేశించి ఇక రిటైర్మెంట్ తీసుకునే సమయం వచ్చింది బ్రో అని నెగెటివ్ కామెంట్ చేశాడు. దానికి ఈ 20 ఏళ్ల గ్రాండ్ మాస్టర్ స్పందించిన తీరు ఇప్పుడు నెట్టింట్లో ఫుల్ వైరల్ అవుతోంది. మొదట చాలా కూల్‌గా థాంక్స్ బ్రో అని సమాధానమిచ్చిన గుకేష్, వెంటనే సారీ బ్రో, నేను ఆల్రెడీ రిటైర్ అయిపోయాను అంటూ విట్టీ రిప్లై ఇచ్చాడు. ఈ క్రేజీ కౌంటర్‌తో ట్రోలర్ నోరు మూయించాడు.
వెంటనే ప్లేటు ఫిరాయించిన ట్రోలర్.. గుకేష్ కూల్ ఆటిట్యూడ్:
గుకేష్ ఇచ్చిన పంచ్ రిప్లై దెబ్బకు ఆ నెటిజన్ వెంటనే ప్లేటు ఫిరాయించాడు. అంత వరకు ట్రోల్ చేయడానికి ప్రయత్నించిన అతడు, ఒక్కసారిగా రూటు మార్చి గుకేష్‌తో ఒక చెస్ గేమ్ ఆడటానికి ఛాన్స్ ఇవ్వాలని అభ్యర్థించడం విశేషం. విమర్శలు, నెగెటివ్ కామెంట్లను తాను ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోనని గుకేష్ గతంలోనే స్పష్టం చేశాడు. అలాంటి కామెంట్స్ తనను మరింత మెరుగ్గా రాణించేలా ప్రోత్సహిస్తాయని, సోషల్ మీడియాకు వీలైనంత దూరంగా ఉండటం వల్ల మైండ్ ప్రశాంతంగా ఉంటుందని నమ్ముతాడు. చెస్ బోర్డుపై ఎంతటి ఒత్తిడిలోనైనా ప్రశాంతంగా ఉండే గుకేష్, ట్రోల్స్‌ను కూడా అదే రీతిలో హ్యాండిల్ చేస్తాడు.
యంగెస్ట్ వరల్డ్ ఛాంపియన్.. అన్‌స్టాపబుల్ క్రేజ్:
డిసెంబర్ 2024లో సింగపూర్‌లో జరిగిన ప్రతిష్టాత్మక వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో చైనా దిగ్గజం డింగ్ లిరెన్‌ను ఓడించి, చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన అన్‌డిస్ప్యూటెడ్ వరల్డ్ చెస్ ఛాంపియన్‌గా గుకేష్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ చారిత్రాత్మక విజయం తర్వాత గుకేష్ సాధిస్తున్న విజయాలు, గ్రౌండ్ వెలుపల చూపిస్తున్న ఈ ప్రశాంతమైన ప్రవర్తన క్రీడాభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. చెస్ బోర్డుపై ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ప్రపంచాన్నే ఏలుతున్న ఈ యంగ్ స్టార్, సోషల్ మీడియాలో కూడా తన హ్యూమర్ సెన్స్‌తో మెరిసిపోతున్నాడు.
Gukesh to Troll: “Sorry, I’m Retired Bro”
— ChessBase Nepal (@chessbasenepal) August 26, 2026
World Champion D Gukesh had a hilarious response for a troll who told him, “Time to retire bro,” in his Instagram DMs.
Gukesh simply replied, “Thanks bro.” When the troll then asked for a chess match, the 20-year-old hit back:
“Sorry… pic.twitter.com/Kd56xwJTtP
