దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తూ, జోమ్ వర్గీస్‌తో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘ఐయామ్ గేమ్’. నహాస్ హిదాయత్ దర్శకుడు. షాబాస్ రషీద్, ఆదర్శ్ సుకుమారన్ రచించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తికాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. తాజాగా దుల్కర్ సల్మాన్ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన కెరీర్‌లో ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఇదే అత్యంత స్టైలిష్ ఫిల్మ్ అని అన్నాడు.
సినిమాలో తన పాత్రతో పాటు మొత్తం వరల్డ్‌ని చాలా మోడర్న్, స్టైలిష్‌గా దర్శకుడు డిజైన్ చేశారని చెప్పాడు. ఇటీవల తను నటించిన సినిమాల్లో ఎక్కువగా వింటేజ్ లుక్స్‌లో కనిపించిన దుల్కర్, ఈసారి పూర్తి భిన్నమైన స్టైలిష్ మాస్ యాక్షన్ అవతార్‌లో కనిపించబోతుండటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. దుల్కర్ నటిస్తున్న 40వ చిత్రమిది. ఆంటోనీ వర్గీస్, తమిళ దర్శకుడు మిస్కిన్, కయదు లోహర్, కతిర్, పార్థ్ తివారీ, తమిళ నటి సంయుక్త విశ్వనాథన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. ఆగస్టులో సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నట్టు తెలియజేశారు.
