
- రేవంత్‌కు అదే గతి
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: ‘‘నాతో పెట్టుకున్నోళ్లను ఎవరినీ వదిలి పెట్టలేదు. అందరినీ ఖతం పట్టించిన. సీఎం రేవంత్ రెడ్డికి కూడా అదే గతి పడ్తది. దమ్ముంటే పోలీసులను పక్కకు జరిపి నా మీదకు రావాలి”అని సీఎంకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు. సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని, తనకు ఏమైనా జరిగితే సీఎం రేవంత్‌దే బాధ్యత అన్నారు. రేవంత్ మనుషులు తనకు ఫోన్లు చేసి చంపుతామని బెదిరిస్తున్నారని, ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశానని చెప్పారు.
రేవంత్ తన ఇంటికొచ్చి కాళ్లు మొక్కితే, ఆయనను తానే పీసీసీ చీఫ్‌ను చేశానని, ఆయనను సీఎం పదవి నుంచి కూడా తానే దింపుతానన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పదవులు ఊడుతాయని, ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి పర్సనాలిటీ డిజార్డర్ సమస్య ఉందని, అందుకే ఆయన పొద్దున ఓ మాట, సాయంత్రం మరో మాట మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే సంజయ్ విమర్శించారు.