డ్రగ్స్ కేసుతో సంబంధం లేదు.. సోషల్ మీడియా ప్రచారం అవాస్తవం : వాసు వర్మ

డ్రగ్స్ కేసుతో సంబంధం లేదు.. సోషల్ మీడియా ప్రచారం అవాస్తవం : వాసు వర్మ

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కలకలం రేపిన  డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. అంతా సమసిపోయిందేమోననుకుంటున్న తరుణంలో డ్రగ్స్ కేసులో కొంతమంది  సినీ ఫైనాన్షియర్లు.. సహా మరికొందరిని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్‌న్యాబ్) అరెస్ట్ చేసింది. ఈ కేసులో హీరో నవదీప్‌ను కూడా అధికారులు విచారించారు. ఇదే కేసులో డైరెక్టర్ వాసువర్మ ను కూడా ఈ నెల (సెప్టెంబర్ 5న) మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. 

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన వాసువర్మ ఎవరంటే..

సీనియర్ నటి జయసుధ కుమారుడు శ్రేయాన్ కపూర్ హీరోగా వచ్చిన చిత్రం ‘బస్తీ’. ఈ సినిమాను( Basti Director ) వాసువర్మ డైరెక్ట్ చేశారు. అయితే వాసు పరారీలో ఉండటం, ఆయన డైరెక్టర్ అనే  విషయం పెద్దగా ఎవరికీ తెలియకపోవడంతో.. ఈ కేసు ఫోకస్ కాలేదని తెలిసింది.  దీంతో కొన్ని పుకార్లకు తెరపడింది. 

అదేంటంటే.. 

వాసువర్మ అనే పేరుతో తెలుగు ఇండస్ట్రీలో ఇద్దరు డైరెక్టర్స్ ఉండటం చర్చనీయాంశమైంది. డ్రగ్స్ తీసుకున్న డైరెక్టర్ వాసువర్మ బస్తీ మూవీని తెరకెక్కించాడు. కానీ ఇతని పేరు అంతగా ఎవ్వరికీ తెలియదు. దీంతో అంత నాగ చైతన్య హీరోగా వచ్చిన జోష్ మూవీ డైరెక్టర్ వాసువర్మనే డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడంటూ వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి.

జోష్ డైరెక్టర్(Josh Director) వాసువర్మ స్పందిస్తూ..

దీంతో జోష్ డైరెక్టర్(Josh Director) వాసువర్మ స్పందిస్తూ..'అందరికీ నమస్కారం..నా పేరు వాసువర్మ..జోష్ మూవీ డైరెక్టర్ ని. నిన్న (సెప్టెంబర్ 24) మధ్యాహ్నం నుంచి ఒక వెబ్ సైట్ లో నాపై తప్పుడు ఆర్టికల్ ప్రచారం అవుతుంది. అదేంటంటే,  డ్రగ్స్ కేసులో అరెస్టయ్యాను అంటూ.. నా పేరుని, ఫోటోని వాడుతూ వస్తున్నవార్తల్లో నిజం లేదు. అదీగాక, అదే న్యూస్ ని మరో సోషల్ మీడియాలో, వెబ్ సైట్స్ లో రిపీట్ అవుతుంది. ఈ కేసుకి సంబంధించి.. నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకు తెలిసి టాలీవుడ్ లో..నా పేరుతో ఉన్న మరో వ్యక్తికీ సంబంధించిన న్యూస్ అయి ఉంటుందని తెలుస్తోంది. అందువల్ల ఇప్పటివరకు పొరపాటులో నా మీద రాసిన ఆర్టికల్స్ అన్ని తొలగించండి. మళ్ళీ రిపీట్ అయితే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంటూ..వీడియో ద్వారా పేర్కోన్నారు. 

వాసు వర్మ, తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే - మాటల రచయిత. అక్కినేని నాగ చైతన్య తొలిసారి హీరోగా నటించిన జోష్ సినిమాకు దర్శకత్వం వహించాడు.