టాక్సికాలజీ రిపోర్ట్ అలా వస్తుందని ముందే తెల్సు : ప్రీతి బ్రదర్

టాక్సికాలజీ రిపోర్ట్ అలా వస్తుందని ముందే తెల్సు : ప్రీతి బ్రదర్

మెడికో ప్రీతి హత్య కేసులో అత్యంత ఆత్రుతగా ఎదురుచూస్తున్న టాక్సికాలజీ రిపోర్ట్ పై ఆమె సోదరుడు పృథ్వీ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఆ రిపోర్ట్ వచ్చినట్టు తమకు ఎలాంటి సమాచారం రాలేదని చెప్పారు. పోలీసులు గానీ, ఇంకెవరూ గానీ తమకు ఎవరూ చెప్పలేదని, మీడియా వచ్చిన వార్తల ద్వారానే తమకు తెలిసిందన్నారు. ప్రీతి గుండె, కాలేయంలో ఎలాంటి విషపూరిత రసాయనాలు లేవంటున్నారని, ప్రీతిని ఆస్పత్రిలో సాయంత్రం 4గంటలకు చేర్పిస్తే.. ఆ రోజు రాత్రి 2 గంటలకు సర్జరీ చేశారని చెప్పారు. తన కడుపులో నుంచి కాటన్ తో క్లీన్ చేయడం తాను చూశానని పృథ్వీ తెలిపారు. బ్లడ్ ఎక్కించిన తర్వాత, ప్లేట్ లెట్స్ ఎక్కించిన తర్వాత.. ఎక్మో పెట్టిన తర్వాత బ్లడ్ సాంపిల్స్ తీసుకున్నారన్నారు. 

తన స్టమక్ లో ఏం లేకుండా మొత్తం క్లీన్ చేశారని పృథ్వీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత బాడీని పంపితే.. ఇదే రిజల్ట్ వస్తుందని తాను ముందే చెప్పానన్నారు. ప్రీతి కేసును అనుమానాస్పద కేసుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులపై తమకు చాలా నమ్మకముందన్న ఆయన.. కానీ ప్రీతి ఫోన్ నుంచి లాస్ట్ కాల్ ఉ.3గంటలకు వెళ్లిందని, తన తండ్రికి రా.8గంటలకు వచ్చిందని.. ఈ మధ్య గ్యాప్ లో ఏం జరిగిందన్న విషయం మాత్రం తమకు చెప్పట్లేదని వాపోయారు. తన తండ్రి రాత్రి ప్రీతిని కలిసినపుడు చాలా ఫిట్ గా ఉందని, అలాంటి ఆమె మార్నింగ్ సరికల్లా ఇలా మారిందని పృథ్వీఆవేదన వ్యక్తం చేశారు.

నేడు డీజీపీని ప్రీతి కుటుంబసభ్యులు కలవనున్నారు. ప్రీతి డెత్ అనుమానాలపై సమగ్ర విచారణ జరిపించాలని  ప్రీతి పేరెంట్స్ కోరనున్నారు. టాక్సికాలజీ రిపోర్ట్ బయటపెట్టాలని డిమాండ్ చేయనున్నారు. ఇక ముందు నుంచీ ప్రీతిది సూసైడ్ కాదని, హత్యేనని కుటుంబసభ్యులు వాదిస్తుండగా.. ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నారు.