నా కులం పేదరికం.. దానిపైనే నా పోరాటం : మోడీ

నా కులం పేదరికం.. దానిపైనే నా పోరాటం : మోడీ

నేను ఏనాడు ఎన్నికల్లో కులం కార్డ్ వాడలేదు 

యూపీ ప్రచారంలో పీఎం మోడీ

యూపీ : బీజేపీ గానీ.. తాను గానీ.. ఏనాడూ కులం కార్డ్ ఉపయోగించి ఓట్లు అడగలేదని అన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర బల్లియా జిల్లాలో ఇవాళ ఎన్నికల ప్రచారం నిర్వహించారాయన.

“మోడీది ఏ కులం అని కలగూరగంప లాంటి కల్తీ కూటమి నన్ను అడుగుతోంది. యూపీని మాయావతి, అఖిలేష్ లు పాలించిన దానికంటే ఎక్కువ ఏళ్లు… నేను గుజరాత్ సీఎంగా కొనసాగాను. కానీ.. నేను వీళ్లలా కాదు. ఏనాడూ కులం పేరు చెప్పి ఓట్లు అడగలేదు. నా కులం పేదరికం. దానిపైనే నా పోరాటం” అన్నారు మోడీ.