క్యాసినో కేసుకు ముందు నేను సాదాసీదా వ్యక్తిని

క్యాసినో కేసుకు ముందు నేను సాదాసీదా వ్యక్తిని

ఈడీ అధికారుల ముందు పొలిటికల్ లీడర్ల పేర్లు చెప్పాలని బెదిరింపులు కాల్ వచ్చినట్లు చికోటీ ప్రవీణ్ తెలిపారు. సూపరీగ్యాంగ్కు డబ్బులు ఇచ్చినట్టు కాల్స్ చేస్తున్నారని.. విదేశీ కోడ్ ఉన్న నంబర్తో కాల్స్ వస్తున్నట్లు తెలిపారు. క్యాసినో కేసు తర్వాత తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని..క్యాసినో వ్యాపారం కంటే ముందు తాను సాదాసీదా వ్యక్తినని చెప్పారు.. ప్రాణహాని ఉందని కమిషనర్ కు లెటర్ రాశానని..హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా వేసినట్లు తెలిపారు. ఈడీ విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని చికోటీ ప్రవీణ్ స్పష్టం చేశారు.

చికోటి అభ్యర్థనను పరిశీలించాలి

క్యాసినో వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చికోటి ప్రవీణ్ హైకోర్టును ఆశ్రయించాడు. తనకు, తన కుటుంబసభ్యులకు ప్రాణహాని ఉందని పిటిషన్ దాఖలు చేశాడు. ఈడీ దర్యాప్తు పూర్తయ్యే వరకు పోలీసు భద్రత కల్పించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు విన్నవించారు. రక్షణ కోరుతూ ఈనెల 4 న పోలీసులకు వినతి పత్రం ఇచ్చినప్పటికీ వారు స్పందించడంలేదని చికోటి ప్రవీణ్ పిటిషన్లో పేర్కొన్నారు. చికోటి పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ప్రవీణ్ అభ్యర్థనను పరిశీలించాలని హైదరాబాద్ సీపీకి ఆదేశించింది. ఆయన దరఖాస్తుపై వారంలోగా నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసిన న్యాయస్థానం పిటిషన్పై విచారణ ముగించింది.