వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై యడియూరప్ప క్లారిటీ

వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై యడియూరప్ప క్లారిటీ

బెళగావి: ఇక ఎన్నికల్లో పోటీ చేయబోన ని కర్నాటక మాజీ సీఎం, బీజేపీ సెంట్రల్  పార్లమెంటరీ కమిటీ సభ్యడు బీఎస్ యడియూరప్ప తెలిపారు. యాక్టివ్ పాలిటిక్స్ లో మాత్రం కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. సోమవారం బెళగావిలో ఆయన మీడియాతో మాట్లా డారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీచేయడం లేదన్నారు. ‘‘నాకు 80 ఏండ్లు. ఎన్నికల్లో పోటీచేయలేను. సీఎం పదవికి రాజీనామా చేసినప్పుడే భవిష్యత్తు లో ఎన్నికల్లో పోటీచేయకూడదని నిర్ణయించుకున్న. అయితే రాష్ట్రంలో బీజేపీని తిరిగి అధికారంలోకి తేవడమే నా లక్ష్యం. 2024 లోక్ సభ ఎలక్షన్స్ లోనూ ప్రధాని మోడీ గెలిచేలా చూస్త” అని యడియూరప్ప పేర్కొన్నారు. మళ్లీ బీజేపీ అభ్యర్థే ముఖ్యమంత్రి అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.