కూలిన IAF ఫైటర్ జెట్ విమానం

కూలిన IAF ఫైటర్ జెట్ విమానం

పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని కలైకుండ ఎయిర్ బేస్‌లో భారత వైమానిక దళానికి చెందిన ఫైటర్ జెట్ కూలిపోయింది. మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో వైమానిక దళానికి శిక్షణ ఇస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పైలట్లిద్దరూ పారాచూట్ సాయంతో తమ ప్రాణాలు కాపాడుకున్నట్లు రక్షణ అధికారి ఒకరు తెలిపారు. 

Also Read:అబుదాబీలో తొలి హిందూ దేవాలయాన్ని ప్రారంభించనున్న మోడీ

నివేదికల ప్రకారం.. కలైకుండ ఎయిర్‌ఫోర్స్ బేస్ నుండి విమానం బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది. ఖరగ్‌పూర్ సమీపంలోని ఖాళీ స్థలంలో విమానం కూలడంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదు. వైమానిక దళం, పోలీసు రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఫైటర్ జెట్ కూలడంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ఆ ప్రాంతాన్ని చూడడానికి స్థానికులు భారీగా అక్కడికి చేరుకుంటున్నారు.