యువ పైలట్లకు అభినందన్ ‘సర్జికల్’ ట్రెయినింగ్

యువ పైలట్లకు అభినందన్ ‘సర్జికల్’ ట్రెయినింగ్

యువ పైలట్లకు ‘సర్జికల్’ ట్రెయినింగ్పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌పై సర్జికల్ స్ట్రైక్స్ వంటి దాడులు మళ్లీ చేయాల్సి వస్తే ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి? యుద్ధవిమానాలను ఎలా నడపాలి? శత్రువిమానాలకు చిక్కకుండా, వాటిని ఎలా నేల కూల్చాలి? పొరపాటున మనం వాళ్లకు దొరికిపోతే ఎలా కాపాడుకోవాలి..? ఇలాంటి విషయాల్లో ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యువ ఫైటర్ పైలట్లకు ప్రత్యేక ట్రెయినింగ్ నడుస్తోంది. ఆ ట్రెయినింగ్ ఇస్తున్నది మరెవరో కాదు.. నిరుడు పాకిస్తాన్ లోని బాలాకోట్‌‌‌‌‌‌‌‌లో టెర్రరిస్టు స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్ చేసి, శత్రు విమానాన్ని కూల్చి, శత్రువుల చేతికి చిక్కినా.. క్షేమంగా ఇండియాకు చేరుకున్న వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్. బాలాకోట్ దాడులు జరిగి ఫిబ్రవరి 27 నాటికి ఏడాది అయిపోయింది. అప్పుడు దేశమంతా హీరో అని మెచ్చుకున్న మన అభినందన్.. ఇప్పుడు ఏడాది తర్వాత ఇంకెందరో హీరోలను తయారు చేసే పనిని షురూ చేశారు.

ఫ్లయింగ్ అంటే పిచ్చి…

‘‘అభినందన్‌‌‌‌‌‌‌‌కు యుద్ధవిమానాల్లో చక్కర్లు కొట్టడమంటే చాలా ఇష్టం. ఇప్పుడు అదే పనిలోకి మళ్లీ వచ్చారు. పైగా యువ పైలట్లతో కలిసి విమానాల్లో చక్కర్లు కొడుతూ.. వారిని ఖతర్నాక్ పైలట్లుగా మారుస్తున్నాడు. ఆయనతో కలిసి ఫ్లయింగ్ చేస్తున్న యువ పైలట్లందరూ ఎంతో స్ఫూర్తి పొందుతున్నారు” అని ఐఏఎఫ్​కు చెందిన ఓ అధికారి వెల్లడించారు. యుద్ధం, బాలాకోట్‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌స్ట్రైక్స్‌‌‌‌‌‌‌‌ వంటి ఎమర్జెన్సీ సమయాల్లో యుద్ధ విమానాలను నడపడం, సమర్థంగా పోరాడటంలో యువ పైలట్లకు సీనియర్‌‌‌‌‌‌‌‌గా అభినందన్‌‌‌‌‌‌‌‌ ట్రెయినింగ్ ఇస్తున్నారని ఆ అధికారి తెలిపారు.