ఆర్​ఆర్​బీల్లో ఆఫీసర్​ జాబ్స్​

ఆర్​ఆర్​బీల్లో ఆఫీసర్​ జాబ్స్​

దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీస్‌‌‌‌ అసిస్టెంట్, ఆఫీసర్​ (స్కేల్‌‌‌‌ 1, 2, 3) పోస్టులకు ఇన్‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ బ్యాంకింగ్‌‌‌‌ పర్సనల్‌‌‌‌ సెలక్షన్‌‌‌‌(ఐబీపీఎస్‌‌‌‌) నోటిఫికేషన్‌‌‌‌ జారీ చేసింది. ఈ ప్రకటన ద్వారా 8594 గ్రూప్‌‌‌‌ ఎ- ఆఫీస‌‌‌‌ర్(స్కేల్‌‌‌‌-1, 2, 3), గ్రూప్‌‌‌‌ బి- ఆఫీస్ అసిస్టెంట్(మ‌‌‌‌ల్టీ ప‌‌‌‌ర్పస్‌‌‌‌) పోస్టులు భర్తీ కానున్నాయి. సొంత రాష్ట్రంలో భరోసా ఇచ్చే బ్యాంక్​ కొలువు కొట్టాలనుకునే అభ్యర్థులకు ఇదో మంచి అవకాశం. ఆర్​ఆర్​బీలో విజయం సాధించాలంటే ఎలా ప్రిపేర్​ అవ్వాలి, సిలబస్​లోని ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకుందాం.. ​ ఆఫీస్‌‌‌‌ అసిస్టెంట్, ఆఫీసర్‌‌‌‌ స్కేల్‌‌‌‌–1 పోస్ట్‌‌‌‌లకు రెండు అంచెల్లో రాత పరీక్ష (ప్రిలిమ్స్​, మెయిన్స్) ఉంటుంది. ఆఫీస్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌లకు మెయిన్‌‌‌‌లో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆఫీసర్స్‌‌‌‌ స్కేల్‌‌‌‌–1 పోస్టులకు  ఇంటర్వ్యూ ఉంటుంది.  ఆఫీసర్‌‌‌‌ స్కేల్‌‌‌‌–2, స్కేల్‌‌‌‌ 3లకు ఒక రాత పరీక్ష.. అందులో ప్రతిభ ఆధారంగా నిర్వహించే ఇంటర్వ్యూల ద్వారా సెలెక్షన్​ ప్రాసెస్​ ఉంటుంది.

సెలెక్షన్​ ప్రాసెస్​: 

ఆఫీస్​ అసిస్టెంట్స్​, ఆఫీసర్​ స్కేల్​–I, పోస్టులకు ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్​, స్కేల్​–II, I​II కి ఒకే దశలో నిర్వహించే ఆన్​లైన్​ ఎగ్జామ్​ నిర్వహిస్తారు. మల్టి పర్పస్​ ఆఫీస్​ అసిస్టెంట్​లు తప్ప మిగిలిన అన్ని పోస్టులకు ఇంటర్వ్యూలు ఉంటాయి. ప్రిలిమినరీ పరీక్ష 45 నిమిషాలకు, మెయిన్​ ఎగ్జామ్​ రెండు గంటలకు ఉంటుంది. ప్రశ్నలు ఇంగ్లీష్​, హిందీ మీడియంలో ఇస్తారు. అన్ని దశల్లో నెగెటివ్​ మార్కింగ్ ఉంది. తప్పు సమాధానానికి ¼  మార్కు మైనస్​ అవుతుంది.

ప్రిపరేషన్​ ప్లాన్​ : ముందుగా ప్రిపరేషన్‌‌‌‌ ఏ విధంగా కొనసాగించాలో ఒక ప్రణాళికను తయారుచేసుకోవాలి. దాని ప్రకారమే సన్నద్ధతను కొనసాగించాలి. ప్రిలిమ్స్‌‌‌‌ పరీక్షల్లో ఉండే ఆప్టిట్యూడ్, రీజనింగ్‌‌‌‌లకే ఎక్కువ సమయం అవసరం అవుతుంది. రోజులో ఎక్కువ సమయాన్ని వీటికే కేటాయిస్తూ, కొంత సమయం మెయిన్స్‌‌‌‌లో ఉండే ఇంగ్లీష్, కరెంట్‌‌‌‌ అఫైర్స్‌‌‌‌లకు కూడా కేటాయించాలి. ఆప్టిట్యూడ్‌‌‌‌లో దాదాపుగా 20 టాపిక్స్, రీజనింగ్‌‌‌‌లో 15 టాపిక్స్‌‌‌‌ ఉంటాయి. వీటన్నింటిపై పూర్తి పట్టు సంపాదించాలి. రోజూ రెండు సబ్జెక్టుల్లో ఒక్కో టాపిక్‌‌‌‌ పూర్తిచేయాలి. ఆపై వీలైనన్ని ప్రశ్నలు సాధన చేయాలి. టాపిక్స్‌‌‌‌ మొత్తం పూర్తి కావడానికి దాదాపు 20- నుంచి 25 రోజుల సమయం పడుతుంది. ప్రశ్నలను సాధించడానికి ఎంత సమయం పడుతుందో కూడా గమనిస్తూ ఉండాలి. ఎక్కువ సమయం తీసుకునే టాపిక్స్‌‌‌‌లోని ప్రశ్నలు ప్రాక్టీస్​ చేయాలి. ప్రిపరేషన్‌‌‌‌ ఏ విధంగా కొనసాగుతోందో తెలుసుకోగలిగేది మాదిరి ప్రశ్నపత్రాలు రాయడం ద్వారా మాత్రమే. ఏయే ప్రశ్నలు సాధించగలుగుతున్నారో, వేటికి ఎక్కువ సమయం పడుతుందో తెలుస్తుంది.

జనరల్‌‌‌‌ అవేర్‌‌‌‌నెస్‌‌‌‌: కరెంట్‌‌‌‌ అఫైర్స్, దేశ ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్‌‌‌‌ రంగంలో పరిణామాలు, మానిటరీ పాలసీ, రుణాలు, వడ్డీ రేట్లు, ఫైనాన్స్‌‌‌‌ రంగ అంశాల గురించి తెలుసుకోవాలి. జాతీయ, అంతర్జాతీయ అంశాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, ముఖ్యమైన ఘటనలు, తేదీలు, వ్యక్తుల గురించి అవగాహన ఉండాలి. 

ఆప్టిట్యూడ్‌‌‌‌/డేటా ఇంటర్‌‌‌‌ప్రిటేషన్‌‌‌‌: అర్థమెటిక్‌‌‌‌ అంశాలు, నంబర్‌‌‌‌ సిరీస్, క్వాడ్రాటిక్‌‌‌‌ ఈక్వేషన్స్, డేటా ఇంటర్‌‌‌‌ప్రిటేషన్, సింప్లిఫికేషన్స్, అప్రాక్సిమేషన్స్‌‌‌‌ అంశాలపై ఫోకస్​ చేయాలి.  వేగం, కచ్చితత్వంతోనే మంచి మార్కులు సాధించేందుకు అవకాశం ఉండడంతో ఎక్కువగా ప్రాక్టీస్​ చేయాలి. 

ప్రొఫెషనల్‌‌‌‌ నాలెడ్జ్‌‌‌‌: అభ్యర్థులు తమ అకడమిక్‌‌‌‌ అర్హతలకు సంబంధించిన అంశాలపై పూర్తి అవగాహన ఏర్పరచుకుంటే ఇందులో ఎక్కువ స్కోర్​ చేయవచ్చు. 
రీజనింగ్‌‌‌‌: కోడింగ్, డీకోడింగ్, సీటింగ్‌‌‌‌ అరేంజ్‌‌‌‌మెంట్స్, పజిల్స్, ఇన్‌‌‌‌–ఈక్వాలిటీస్, బ్లడ్‌‌‌‌ రిలేషన్స్, డైరెక్షన్స్, స్టేట్‌‌‌‌మెంట్స్, ఆల్ఫాబెటికల్‌‌‌‌ సీక్వెన్సెస్, సిలాజిజమ్స్, కాజ్‌‌‌‌ అండ్‌‌‌‌ ఎఫెక్ట్, ఇన్‌‌‌‌పుట్‌‌‌‌–అవుట్‌‌‌‌పుట్స్‌‌‌‌ తదితర అంశాలపై ఫోకస్​ చేయాలి. 

ఇంగ్లీష్‌‌‌‌ లాంగ్వేజ్‌‌‌‌: గ్రామర్‌‌‌‌తోపాటు వొకాబ్యులరీ, రీడింగ్‌‌‌‌ కాంప్రహెన్షన్, సెంటెన్స్‌‌‌‌ కరెక్షన్స్, ఫిల్‌‌‌‌ ఇన్‌‌‌‌ ద బ్లాంక్స్, యాంటానిమ్స్, సినానిమ్స్‌‌‌‌పై పట్టు సాధించాలి. ఇంగ్లీష్‌‌‌‌ న్యూస్​ పేపర్​ డైలీ చదవడంతో వొకాబ్యులరీ మెరుగుపరచుకోవచ్చు.

కంప్యూటర్‌‌‌‌ నాలెడ్జ్‌‌‌‌: ఇందులో కంప్యూటర్‌‌‌‌ ఆపరేటింగ్‌‌‌‌ సిస్టమ్స్‌‌‌‌ (కీ బోర్డ్‌‌‌‌ షార్ట్‌‌‌‌ కట్స్, ఎంఎస్‌‌‌‌ ఆఫీస్, ఎంఎస్‌‌‌‌ ఎక్సెల్, పవర్‌‌‌‌ పాయింట్‌‌‌‌ ప్రజెంటేషన్‌‌‌‌ తదితర అంశాలు) గురించి తెలుసుకోవాలి. 

ఫైనాన్షియల్‌‌‌‌ అవేర్‌‌‌‌నెస్‌‌‌‌: తాజా బ్యాంకింగ్‌‌‌‌ రంగ పరిణామాలు, బ్యాంకింగ్‌‌‌‌ వ్యవస్థ విధానాలు, ఆర్థిక రంగంలో జరుగుతున్న తాజా పరిణామాలపై అవగాహన ఉండాలి.

నోటిఫికేషన్​ 

ఖాళీలు: ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్): 5538, ఆఫీసర్ స్కేల్-1 (ఏఎం): 2485, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ (మేనేజర్) స్కేల్-2: 315, ఐటీ ఆఫీసర్ స్కేల్-2: 68, సీఏ ఆఫీసర్ స్కేల్-2: 21, లా ఆఫీసర్ స్కేల్-2: 24, ట్రెజరీ మేనేజర్ స్కేల్-2: 8, మార్కెటింగ్ ఆఫీసర్ స్కేల్-2: 3, అగ్రికల్చర్ ఆఫీసర్ స్కేల్-2: 59, ఆఫీసర్ స్కేల్-3 (సీనియర్ మేనేజర్): 73 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, సీఏ, ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు ఆఫీసర్ స్కేల్-3 (సీనియర్ మేనేజర్) పోస్టులకు 21 నుంచి 40 ఏళ్లు. ఆఫీసర్ స్కేల్-2 (మేనేజర్) పోస్టులకు 21 నుంచి 32 ఏళ్లు. ఆఫీసర్ స్కేల్-1 (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లు. ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులకు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో జూన్​ 21 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమ్స్​ పరీక్ష ఆగస్టులో, మెయిన్స్​ ఎగ్జామ్​ సెప్టెంబర్​లో,  ఇంటర్వ్యూ తేదీలు(ఆఫీసర్స్ స్కేల్ 1, 2, 3): అక్టోబర్/ నవంబర్ లో ఉంటాయి.  పూర్తి వివరాలకు www.ibps.in వెబ్​సైట్​లో సంప్రదించాలి. 

ఉమ్మడి ప్రణాళిక: అభ్యర్థులందరూ స్కేల్‌‌‌‌-1 ఆఫీసర్, ఆఫీస్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌ పరీక్షలు రెండూ రాస్తుంటారు. కాబట్టి ప్రిపరేషన్‌‌‌‌ ఉమ్మడిగా కొనసాగించాలి. ఈ రెండు పరీక్షల్లో ఉన్న మరో అదనపు ప్రయోజనం ఏమిటంటే.. ఈ రెండు పరీక్షా విధానాలు, సబ్జెక్టులు ఒకే విధంగా ఉంటాయి. ప్రశ్నల స్థాయిలో మాత్రమే తేడా ఉంటుంది.  స్కేల్‌‌‌‌-1 ఆఫీసర్ల పరీక్షకు సన్నద్ధమయితే ఆఫీస్‌‌‌‌ అసిస్టెంట్ల పరీక్షకు ప్రిపరేషన్‌‌‌‌ పూర్తయినట్టే.  ప్రిలిమ్స్​లో రెండు సబ్జెక్టులు (రీజనింగ్, న్యూమరికల్‌‌‌‌ ఎబిలిటీ/క్వాంటిటేటివ్‌‌‌‌ ఆప్టిట్యూడ్‌‌‌‌) మాత్రమే ఉంటాయి. ప్రిలిమ్స్‌‌‌‌లోని రెండు సబ్జెక్టులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, ప్రిలిమ్స్, మెయిన్స్‌‌‌‌ పరీక్షలకు కలిపి ఉమ్మడిగానే కొనసాగించాలి. ప్రిలిమ్స్‌‌‌‌ పరీక్షకు దాదాపు రెండు నెలల సమయం ఉంటుంది.