మళ్లీ మంచిరెడ్డి కిషన్ రెడ్డే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అవుతారు : మంచిరెడ్డి ప్రశాంత్ 

మళ్లీ మంచిరెడ్డి కిషన్ రెడ్డే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అవుతారు : మంచిరెడ్డి ప్రశాంత్ 

రంగారెడ్డి జిల్లా : ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కుమారుడు ‘ప్రగతి నివేదన యాత్ర’ చేపట్టారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి వెళ్లేలా ప్రగతి నివేదన యాత్ర చేపట్టారు.  దాదాపు 60 రోజులపాటు పాదయాత్ర కొనసాగనుంది. పాదయాత్ర చేసేముందు యాచారం మండలం నందివనపర్తి శ్రీ నందీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భారీ సభ ఏర్పాటు చేసిన అనంతరం పాదయాత్ర ప్రారంభించారు. 

తన నియోజకవర్గంలో వందల కోట్లతో అభివృద్ధి పనులు చేశానని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి చెప్పారు. ప్రజలకు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు తన కుమారుడు పాదయాత్ర చేపట్టారని చెప్పారు. తమ తండ్రి ఇబ్రహీంపట్నాన్ని చాలా అభివృద్ధి చేశారని, రానున్న కాలంలో మరింత అభివృద్ధి జరగనుందని మంచిరెడ్డి కిషన్ రెడ్డి కుమారుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి తెలిపారు. మరోసారి కూడా మంచిరెడ్డి కిషన్ రెడ్డే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అవుతారని జోస్యం చెప్పారు.