వికారాబాద్, వెలుగు: వికారాబాద్జిల్లాలో ఈ నెల 7 నుంచి 11 వరకు తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేశ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఎల్లూరు నుంచి గౌరిదేవిపల్లి వద్ద వాల్వ్ మరమ్మత్తుల నిర్వహణ కారణంగా ముడి నీరు రానందున వికారాబాద్, తాండూర్, పరిగి నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీలు, గ్రామాలకు నీటి సరఫరా చేయలేకపోతున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు ఈ అంతరాయాన్ని గుర్తించి సహకరించాలని కోరారు.
