సంగారెడ్డి జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పతంగి ఎగుర వేస్తున్న బాలుడికి విద్యుత్ షాక్ తగిలింది. పతంగికి ఉన్న మాంజా దారం హైటెన్షన్ వైర్లకు తగిలి విద్యుత్ సరఫరా కావడంతో ప్రమాదం జరిగింది. దీంతో బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే..
సంగారెడ్డి జిల్లా ఆంధోల్ మండలం డాకూర్ లో సోమవారం( జనవరి 5)ఈ ఘటన చోటు చేసుకుంది.. డాకూర్ లోని స్థానిక డబుల్ బెడ్ రూం ఇండ్ల దగ్గర ఆరేళ్ల బాలుడు అరవింద్ గాలిపటం ఎగురవేస్తుండగా కుప్పకూలాడు.గాలిపటం హైటెన్షన్ వైర్లకు తగడంతో విద్యుత్ షాక్ కు గురైనట్లు గుర్తించారు. విద్యుత్ షాక్ తో బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. బాలుడి ఒళ్లంతా కాలిపోయింది.
చికిత్సకోసం బాలుడిని హుటాహుటిన వెంటనే జోగిపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ల సూచన మేరకు మెరుగైన చికిత్స హైద్రాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
చిలిప్‌చేడ్ మండలం ఇబ్రహీంబాద్ కు చెందిన అరవింద్ తల్లి స్వప్పతో కలిసి తన పెద్దనాన్న ఊరైనడాకూర్ కు వచ్చాడు. ఈక్రమంలో పిల్లలతో కలిసి పతంగి ఎగురవేస్తుండగా ప్రమాదం జరిగింది. మాంజా దారానికి విద్యుత్ సరఫర కావడంతో .. మాంజా దారం విక్రయాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
