
దుబాయ్: ఐసీసీ విమెన్స్ వన్డే ర్యాంకింగ్స్‌లో ఇండియా రెండో ప్లేస్‌కు మరింత చేరువైంది. ట్రై నేషన్స్ సిరీస్‌ను గెలవడంతో ఎనిమిది రేటింగ్ పాయింట్లు సాధించిన టీమిండియా (121).. రెండో ప్లేస్‌లో ఉన్న ఇంగ్లండ్(127)కు కేవలం ఆరు పాయింట్ల దూరంలో నిలిచింది. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా 167 రేటింగ్ పాయింట్లతో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. అయితే కంగారూల ఆధిక్యం 44 నుంచి 40 పాయింట్లకు తగ్గింది.
న్యూజిలాండ్ (96), సౌతాఫ్రికా (90), శ్రీలంక (82) వరుసగా నాలుగు నుంచి ఆరు ర్యాంక్‌ల్లో ఉన్నాయి. బంగ్లాదేశ్ (79), పాకిస్తాన్ (78), వెస్టిండీస్ (72), ఐర్లాండ్ (50) వరుసగా తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. మే 2022 నుంచి ఏప్రిల్ 2024 మధ్య జరిగిన మ్యాచ్‌లకు 50 శాతం వెయిటేజీతో పాటు ఆ తర్వాతి మ్యాచ్‌లకు వంద శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంక్‌లను కేటాయించారు.