మంత్రి జగదీష్ రెడ్డితో డిండి భూ నిర్వాసితుల భేటీ

మంత్రి జగదీష్ రెడ్డితో డిండి భూ నిర్వాసితుల భేటీ

హైదరాబాద్ లో మంత్రి జగదీష్ రెడ్డిని ఆయన నివాసంలో నాంపల్లి మండలం కిష్టరాయన్​పల్లి, లక్ష్మణపురం గ్రామానికి చెందిన భూ నిర్వాసితులు భేటీ అయ్యారు. డిండి ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితుల సమస్యలను మంత్రి జగదీష్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. పునరావాసం కింద రంగారెడ్డి జిల్లాలో 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని కోరారు. దీంతో నల్గొండ జిల్లా కలెక్టర్ తో మంత్రి జగదీశ్ రెడ్డి ఫోన్ లో మాట్లాడారు. కిష్టరాయన్​పల్లి, లక్ష్మణపురం గ్రామాలకు వెళ్లి, భూ నిర్వాసితుల సమస్యలను తెలుసుకుని.. వారం రోజుల్లోనే పరిష్కరించాలని కలెక్టర్ ను ఆదేశించారు. 

డిండి ఎత్తిపోతల పథకం కింద భూములు కోల్పోయిన భూ నిర్వాసితులు మర్రిగూడ చౌరస్తాలో ఆమరణ దీక్షలు చేసిన సంగతి తెలిసిందే. కిష్టరాయన్ పల్లి, చర్లగూడెం భూ నిర్వాసితులను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పరామర్శించారు. ఆర్ అండ్ ​ఆర్ ప్యాకేజీ కింద రూ.15 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించేదాకా నిర్వాసితుల తరఫున పోరాడుతానని హామీ ఇచ్చారు.