
భారత జట్టు ఇంగ్లండ్ పర్యటన కోసం BCCI కఠిన నిబంధనలు చేపట్టింది. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ కోసం త్వరలోనే ఇండియన్ టీం ఇంగ్లండ్ వెళ్లనుంది. ఇప్పటికే ఇంగ్లండ్ పర్యటన కోసం బీసీసీఐ 20 మంది ఆటగాళ్లతో జంబో జట్టును ప్రకటించింది. ఈ క్రమంలో ఇండియన్ ప్లేయర్లు కరోనాబారిన పడకుండా బీసీసీఐ కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. బ్రిటన్ విమానం ఎక్కక ముందు ఎవరికి కరోనా పాజిటివ్ వచ్చినా సిరీస్ మొత్తానికి దూరం కావాల్సి ఉంటుందని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కోలుకున్న తర్వాత కూడా ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసే అవకాశం లేదని తేల్చి చెప్పినట్లు సమాచారం. మరోవైపు పర్యటనకు ముందే ముంబైలో ఆటగాళ్లు 14 రోజులు క్వారంటైన్‌లో ఉండనున్నారు. ఆటగాళ్లందరికీ మొదటి డోసు టీకా ఇండియాలో, రెండో డోసును బ్రిటన్లో ఏర్పాటు చేయనుంది బీసీసీఐ.