
టీమిండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రాపై వెస్టిండీస్ గ్రేట్ బౌలర్ కర్ట్‌లీ ఆంబ్రోస్ ప్రశంసలు కురిపించాడు. 400 వికెట్ల మైలురాయిని బుమ్రా సులువుగా చేరుకుంటాడని ఆంబ్రోస్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘భారత టీమ్‌లో మంచి ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. నేనైతే బుమ్రాకు పెద్ద ఫ్యాన్‌ను. నేను చూసిన బౌలర్లలో అతడు చాలా వైవిధ్యం. అతడు చాలా ప్రభావవంతమైన బౌలర్. ఫాస్ట్ బౌలర్లకు మంచి రిథమ్ అవసరం. అప్పుడు మంచి డెలివరీలు వేయగలరు. బుమ్రాది చాలా చిన్న రనప్. కాబట్టి శరీరంపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. అతడు మంచి ఫిట్‌నెస్‌తో బలంగా ఉండటం అవసరం. 400 వికెట్ల మైలురాయిని చేరుకోవాలంటే బుమ్రా ఫిట్‌నెస్, శరీరాన్ని కాపాడుకోవాలి’ అని ఆంబ్రోస్ పేర్కొన్నాడు.