శ్రీలీల కొత్త టాలెంట్ క్లిక్కయితే.. మరో పదేళ్లు కన్ఫర్మ్!

శ్రీలీల కొత్త టాలెంట్ క్లిక్కయితే.. మరో పదేళ్లు కన్ఫర్మ్!

యంగ్​ అండ్​ ఎనర్జిటిక్​ బ్యూటీ శ్రీలీల(Sreeleela)  మరో ఇంట్రెస్టింగ్​ రోల్​తో మెప్పించింది. బాలకృష్ణతో కలిసి ఆమె నటించిన భగవంత్​ కేసరి(Bhagavanthkesari) థియేటర్లలో సందడి చేస్తోంది. శ్రీలీల గత సినిమాలకు భిన్నంగా ఈ మూవీలో దర్శకుడు ఆమె క్యారెక్టర్​ను డిజైన్​ చేశాడు.

ఇప్పటివరకు డ్యాన్సులు, గ్లామర్​ పాత్రలతోనే గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీకి..భగవంత్ కేసరి సినిమాతో కొత్త ఇమేజ్​ వస్తుందనే టాక్​ నడుస్తోంది. క్లైమాక్స్​లో శ్రీలీల యాక్షన్​ సీన్స్​తో ఆడియెన్స్​ను థ్రిల్​ చేసింది. బాలయ్య తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ఎమోషన్​ వర్కవుట్ చేసి మెప్పించింది.

విజ్జి పాప క్యారెక్టర్​లో ఒదిగిపోయిన తీరు మరో ప్లస్​ పాయింట్​గా నిలిచింది. మరి ఈ మూవీ ఈ హీరోయిన్​కి ముందు ముందు ఎలాంటి ఆఫర్లను తెచ్చిపెడుతుందో చూడాలి. శ్రీలీలకు ఉన్న ఈ ఎమోషన్ యాంగిల్ కనుక క్లిక్కయితే..మరో పదేళ్లు హీరోయిన్ గా ఇండస్ట్రీలో రాణిస్తుందని సినీ క్రిటిక్స్ మాట్లాడుకుంటున్నారు. 

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కువ డిమాండ్ ఉన్న హీరోయిన్ శ్రీలీల. ఇక ఈ బ్యూటీ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది. దాదాపు 10 మూవీస్ లో నటిస్తూ బిజీయెస్ట్ హీరోయిన్ గా మారింది.నవంబర్‌లో వైష్ణవ్ తేజ్ ఆదికేశవ మూవీ రిలీజ్ అవుతుండగా..జనవరిలో మహేష్ బాబు గుంటూరు కారం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్. ఇలా దాదాపు 10 చిత్రాల తర్వాత..ప్రభాస్ తో మరో భారీ చిత్రానికి సైన్ చేసింది.