మోదీ ఫోన్ చేసి బైక్ ఆపమంటే ఆపుతా.. విమెన్ బైకర్ షాకింగ్ కామెంట్స్

మోదీ ఫోన్ చేసి బైక్ ఆపమంటే ఆపుతా.. విమెన్ బైకర్ షాకింగ్ కామెంట్స్

ముంబైలోని బాంద్రా-వర్లీ సీ లింక్‌పై మోటర్‌బైక్‌ను నడుపుతూ ట్రాఫిక్ అధికారిని దుర్భాషలాడి, బెదిరించి, నెట్టివేసినందుకు 26 ఏళ్ల ఆర్కిటెక్ట్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ అధికారులతో మహిళ వాగ్వాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఆమె బైక్ పై వేగంగా వెళుతున్నట్లు గుర్తించి పోలీసులు,, ఆమెను ఆపివేశారు. ఆ తర్వాత ఆమె కానిస్టేబుల్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగడం వివాదంగా మారింది.

‘నరేంద్రమోదీ నాకు ఫోన్ చేసి బైక్ ఆఫ్ చేయమని చెబితే నేను చేస్తాను.. వెళ్లి మోదీని పిలవండి’ అంటూ బైక్ దిగేందుకు ఆ మహిళ నిరాకరించింది. అధికారి ఆమెను పైకి లాగడానికి ప్రయత్నించగా.. ఆమె అతన్ని తిడుతూ, “నేను నీ చేయి నరికేస్తాను. నా బైక్‌పై చేయి వేయడానికి నీకు ఎంత ధైర్యం” అంటూ కాంట్రవర్శియల్ కామెంట్స్ చేసింది. నూపుర్ ముఖేష్ పటేల్ అనే ఈ మహిళ తన బుల్లెట్‌ను సీ లింక్‌పై నడుపుతూ దక్షిణ ముంబై వైపు వెళుతుండగా.. బాంద్రా-వర్లీ సీ లింక్ సెక్యూరిటీ సిబ్బంది నుంచి తమకు కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు.

"పోలీసు సిబ్బంది ఆమెను ఆపినప్పుడు, ఆమె వారితో వాదించడం ప్రారంభించింది. ఈ రోడ్డు తన తండ్రి స్వంతం అని,  ఆమె పన్ను చెల్లిస్తుందని, తనను ఎవరూ ఆపలేరని చెప్పింది. ఎన్నిసార్లు విన్నవించినప్పటికీ, ఆమె తన ద్విచక్ర వాహనాన్ని రోడ్డు పక్కకు ఆపకపోవడంతో ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగింది' అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

ALSO READ : ఈవారం OTTలో ఏకంగా 37 సినిమాలు.. ఆడియన్స్ గెట్ రెడీ

"ఆమె అనవసరమైన వాదనలకు దిగింది, ఒక కానిస్టేబుల్‌ను కూడా నెట్టింది" అని చెప్పారు. ఆమెపై నిర్లక్ష్యమైన డ్రైవింగ్, ప్రభుత్వ సేవకుడిపై దాడికి పాల్పడినందుకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

పటేల్ మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ నివాసి. బుల్లెట్ అక్కడి రియల్ ఎస్టేట్ సంస్థలో రిజిస్టర్ చేయబడింది. విచారణ అధికారి ముందు హాజరు కావాలంటూ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 41A కింద ఆమెకు నోటీసు ఇచ్చిన తర్వాత, ఆమె అక్కడ్నుంచి వెళ్ళేందుకు అనుమతి లభించింది.